
భారీ విజయంతో..
ఈ టోర్నమెంట్‌లో ఇప్పటిదాకా ఏ జట్టూ చేయలేని 211 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఛేజింగ్‌కు దిగిన ఆఫ్ఘన్‌ను 144 పరుగుల వద్దే కట్టడి చేసింది. 66 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది కోహ్లీసేన. ఈ విజయంతో.. జట్టు రన్‌రేట్ ప్లస్‌లోకి వచ్చింది. రెడ్ జోన్ నుంచి గ్రీన్‌లోకి మారింది. భారీ ఆధిక్యంతో గెలవడం.. జట్టుకు ఊపిరి పోసింది. సెమీ ఫైనల్స్‌కు చేరే అవకాశాలను సజీవంగా ఉంచింది. సెమీస్ చేరడానికి అవకాశాలను సృష్టించుకుంది టీమిండియా.

మైనస్ నుంచి ప్లస్‌లోకి
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్ మొదలయ్యేంత వరకూ టీమిండియా నెట్ రన్‌రేట్ మైనస్‌లో కనిపించింది. -1.609గా రికార్డయింది. ఈ మ్యాచ్ ముగిసే సరికి ప్లస్‌లోకి వచ్చింది. +0.073గా నమోదయింది. ఆఫ్ఘనిస్తాన్ నెట్ రన్‌రేట్ +3.097 నుంచి +1.481కు పడిపోయింది. న్యూజిలాండ్ రన్‌రేట్ +0.816. భారత్ కంటే మెరుగైన రన్‌రేట్‌ను కొనసాగిస్తోన్నాయి ఈ రెండు జట్లు. న్యూజిలాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఓ లీగ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఎవరి రన్‌రేట్ ఎంతకు దిగుతుందనేది ఈ మ్యాచ్ నిర్ధారిస్తుంది.

రెండు మ్యాచ్‌లల్లో భారీ విజయం..
భారత్ కూడా ఇంకా రెండు మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఒకటి నమీబియా..మరొకటి స్కాట్లాండ్. ఈ రెండింట్లోనూ టీమిండియా ఘన విజయాన్ని సాధించినప్పటికీ.. సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు కాదు. ఎందుకంటే- ఆఫ్ఘనిస్తాన్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోవాల్సి ఉంటుంది కాబట్టి. న్యూజిలాండ్ ఓడిపోతే.. ఆ జట్టు నెట్ రన్‌రేట్ క్షీణిస్తుంది. అది అయ్యే పనేనా అంటే దాదాపు కాదనే అనుకోవచ్చు. న్యూజిలాండ్ కంటే ఏ రకంగానూ ఆఫ్ఘనిస్తాన్ బలంగా లేదు.

స్కాట్లాండ్, నమీబియాలపై ఏ రేంజ్‌లో గెలవాలంటే..
భారత జట్టు తన మిగిలిన రెండు మ్యాచ్‌లల్లో స్కాట్లాండ్, నమీబియాలపై భారీ విజయాన్ని అందుకోవాల్సి ఉంటుంది. తొలుత కోహ్లీ సేన బ్యాటింగ్ చేస్తే.. 60కి పైగా పరుగుల తేడాతో చిత్తు చేయాలి. ఛేజ్ చేయాల్సి వస్తే.. 13 ఓవర్లలోనే ప్రత్యర్థి నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించాలి. ఈ రెండు జట్లతోనూ అదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. 56 పరుగుల తేడాతో ఈ రెండు జట్లను కూడా ఓడించాల్సి ఉంటుంది. ఈ రెండు సాధ్యపడినప్పటికీ.. ఆఫ్ఘన్ చేతిలో కివీస్ ఓటమిపాలు కావడమే అసాధ్యం కావచ్చు.

న్యూజిలాండ్ గనక గెలిస్తే..
ఆప్ఘనిస్తాన్‌పై జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గనక విజయం సాధించితే.. టీమిండియా పని అయిపోయినట్టే. తట్టా బుట్టా సర్దేసుకోవడమే. భారత్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ రేస్ నుంచి తప్పుకొంటాయి. న్యూజిలాండ్ సెమీస్‌కు రెండోసారి చేరినట్టవుతుంది. నమీబియాను కూడా ఓడించాల్సి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ చేరాలీ అంటే.. న్యూజిలాండ్‌ను ఓడించి తీరాలి. ఓడితే మాత్రం తనతో భారత్ సెమీ ఫైనల్స్ అవకాశాలను కూడా నట్టేట ముంచినట్టవుతుంది. తాను ఆడాల్సిన చివరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే.. బ్లాక్ క్యాప్స్ నేరుగా సెమీస్‌లోకి ఎంట్రీ అవుతారు. నెట్ రన్‌రేట్‌తో పనే ఉండదు.


Click it and Unblock the Notifications
