Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వరల్డ్ కప్‌కు దూబె ఎంపికైనట్లే.. కానీ ఓ సమస్య- డివిలియర్స్

ఈ ఏడాది ఆరంభంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ అనంతరం ఆల్‌రౌండర్ శివమ్ దూబె పేరు మార్మోగుతోంది. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌‌కు వచ్చే దూబె‌కు విధ్వంసం సృష్టించే సామర్థ్యం సొంతం. స్పిన్నర్లపై కనికరం లేకుండా దాడి చేసే ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మ్యాచ్‌ను మలుపుతిప్పే ఇన్నింగ్స్ ఆడగలడు.

ఇక ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌కు దూబె వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 242 పరగులు చేశాడు. స్ట్రైక్‌రేటు 163.51తో పరుగులు సాధించాడు. దీంతో మరో నెలన్నర రోజుల్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ భారత్ జట్టులో దూబె ఎంపిక దాదాపు ఖరారైనట్లే అనే వార్తలు వస్తున్నాయి.

T20 World Cup Selection Drama Dubey s Inclusion Meets Hurdles- AB De Villiers

అయితే వరల్డ్‌కప్ జట్టులో దూబె ఉంటాడని పూర్తినమ్మకంతో చెప్పలేమని దక్షిణాఫ్రికా దిగ్గజ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. భారత జట్టులో ఉన్న విపరీతమైన పోటీతో దూబె స్థానం సుస్థిరం కాదని పేర్కొన్నాడు. కానీ దూబె అద్భుతమైన ప్లేయర్ అని డివిలియర్స్ తెలిపాడు. ఆర్సీబీని వదిలి సీఎస్కే ఫ్రాంచైజీ చేరుకున్న తర్వాత దూబె ప్రదర్శనలో ఎంతో మార్పు వచ్చిందని అన్నాడు.

''టీ20 వరల్డ్ కప్‌ జట్టులో శివమ్ దూబె తన స్థానాన్ని సంపాదించుకున్నట్లే. కానీ అసలు సమస్య భారత జట్టులో భారీ పోటీనే. అయితే అతను ఎన్నో సందరర్భాల్లో పైచేయి సాధించాడు. ఈ ఐపీఎల్‌లో అద్భుత సీజన్‌ను కలిగి ఉన్నాడు. అతడు పవర్‌హస్ హిట్టర్, ఫెంటాస్టిక్ క్రికెటర్. సీఎస్కే క్యాంప్‌లో దూబె ఏదో కనుగొన్నాడు. అది అతనికి స్వేచ్ఛని ఇచ్చింది. అతడు తన జీవితంలో అత్యుత్తమ క్రికెట్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది'' అని డివిలియర్స్ పేర్కొన్నాడు.

కాగా, జూన్ 2వ తేదీ నుంచి టీ20 ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగాటోర్నీకి అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లన్నీ యూఎస్‌ఏలో, ఆ తర్వాత దశ పోరులన్నీ కరేబియన్‌లో దీవుల్లో జరగనున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌ పోరుతో టీమిండియా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. జూన్ 9న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది.

Story first published: Thursday, April 18, 2024, 8:55 [IST]
Other articles published on Apr 18, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+