Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది.. పాక్‌తో పోరుతోనే భార‌త్ వేట మొద‌లు

T20 World Cup Schedule Release.. October 23rd India vs Pakistan

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 2022 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఈ వ‌రల్డ్‌క‌ప్ షెడ్యూల్‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుద‌ల చేసింది. ఈ వ‌ర‌ల్డ్‌కప్ అక్టోబ‌ర్ 16 నుంచి న‌వంబ‌ర్ 13 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. మొత్తం 45 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో టీమిండియా త‌మ వేట‌ను పాకిస్థాన్‌తోనే మొద‌లు పెట్ట‌నుంది. సూప‌ర్ 12 ద‌శ‌లో తొలి మ్యాచ్‌లో గ‌త వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌లిస్టులైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల‌ నిర్వ‌హ‌ణ ఎలా?

వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌ల‌ నిర్వ‌హ‌ణ ఎలా?

ఈ వ‌ర‌ల్డ్‌క‌ప్ నాకౌట్ స్టేజ్‌లో జ‌ర‌గ‌నుంది. సూప‌ర్ 12లో 12 జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయి. ఇందు కోసం ఇప్ప‌టికే 8 జ‌ట్లు టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా సూప‌ర్ 12కు అర్హ‌త సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం తొలి రౌండ్‌లో ఆయ జ‌ట్ల‌ను రెండు గ్రూప్‌లుగా విడ‌దీసి క్వాలిఫైయ‌ర్ మ్యాచ్‌లు నిర్వ‌హిస్తారు.

అక్టోబర్ 16 నుంచి 21 మధ్య తొలి రౌండ్ పోటీలు జరగనుండగా.. 22 నుంచి సూపర్ 12 మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. న‌వంబ‌ర్ 6న ముగుస్తాయి. న‌వంబ‌ర్ 9, 10న సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లు, 13న ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుంది. తొలి రౌండ్ పోటీల‌లో అక్టోబ‌ర్ 16న జ‌రిగే వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలి మ్యాచ్‌లో శ్రీ‌లంక‌, న‌మీబియా త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇక అక్టోబ‌ర్ 22న ప్రారంభమ‌య్యే సూప‌ర్ 12 మ్యాచ్‌ల‌లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ త‌ల‌ప‌డ‌తాయి.

ఏ గ్రూపులో ఏ జ‌ట్టు?

ఏ గ్రూపులో ఏ జ‌ట్టు?

సూప‌ర్ 12 మ్యాచ్‌ల‌ను రెండు గ్రూపుల‌గా విడ‌దీసి నిర్వ‌హించ‌నున్నారు. గ్రూప్‌ 1లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ A విజేత, గ్రూప్ B రన్నరప్ ఉండ‌నున్నాయి. ఇక గ్రూపు 2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తోపాటు తొలి రౌండ్‌లోని గ్రూప్ B విజేత, గ్రూప్ A ర‌న్న‌ర‌ఫ్ ఉండ‌నున్నాయి.

భార‌త్ vs పాకిస్థాన్ పోరు

భార‌త్ vs పాకిస్థాన్ పోరు

ఈ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భార‌త్ పోరు అక్టోబ‌ర్ 23 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే చిర‌కాల ప్ర‌త్య‌ర్థి పాకిస్థాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. మెల్‌బోర్న్ వేదిక‌గా అక్టోబ‌ర్ 23న ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో అక్టోబ‌ర్ 27న సిడ్నీ వేదిక‌గా గ్రూప్ ఏ ర‌న్న‌ర‌ఫ్‌తో, అక్టోబ‌ర్ 30న పెర్త్ వేదిక‌గా సౌతాఫ్రికాతో, న‌వంబ‌ర్ 2న ఆడిలైడ్ వేదిక‌గా బంగ్లాదేశ్‌తో, న‌వంబ‌ర్ 6న మెల్‌బోర్న్ వేదిక‌గా గ్రూప్ బీ విన్న‌ర్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌తో వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సూప‌ర్ 12 మ్యాచ్‌లు గెలుస్తాయి.

వ‌ర‌ల్డ్‌క‌ప్ వేదిక‌లు

వ‌ర‌ల్డ్‌క‌ప్ వేదిక‌లు

ఆస్ట్రేలియాలోని మొత్తం 7 వేదిక‌ల‌లో 2022 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గ‌నుంది. తొలి రౌండు పోటీల‌కు గీలాంగ్‌, హోబ‌ర్ట్ మైదానాలు వేదిక‌లుగా నిల‌వ‌నున్నాయి. ఇక సూప‌ర్ 12, సెమీ ఫైన‌ల్స్‌, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌కు బ్రిస్బేన్, పెర్త్, అడిలైడ్, సిడ్నీ, మెల్‌బోర్న్ వేదిక‌లుగా నిల‌వ‌నున్నాయి. ఫైన‌ల్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాల‌మానం ప్ర‌కారం రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది.

Story first published: Friday, January 21, 2022, 8:57 [IST]
Other articles published on Jan 21, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+