For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: ధోనీలా ట్రై చేద్దామని ఇంగ్లండ్ కొంపముంచిన సామ్ కరన్!

ఎంఎస్ ధోనీ తరహాలో మ్యాచ్‌ను ఒంటిచేత్తో ఫినిష్ చేద్దామనుకున్న ఆల్‌రౌండర్ సామ్ కరన్‌కు నిరాశ ఎదురైంది. జట్టును విజయతీరాలకు చేర్చలేక ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేశాడు. అసలేం జరిగిదంటే.. సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓ దశలో ఓటమిదిశగా, అనంతరం విజయానికి చేరువగా దూసుకెళ్లిన ఇంగ్లండ్ అంతిమంగా పరాజయాన్ని చవిచూసింది.

మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 163 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ (65; 38 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (43; 28 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టారు. జోఫ్రా ఆర్చర్ (3/40) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లిష్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది. హ్యారీ బ్రూక్ (53; 37 బంతుల్లో, 7 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (33; 17 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు.

T20 World Cup Sam Curran Takes Blame for England s Defeat Cites MS Dhoni as Inspiration

కేశవ్ మహరాజ్ (2/25), రబాడ (2/32) చెలరేగడంతో ఇంగ్లండ్ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ బ్రూక్-లివింగ్‌స్టోన్ అయిదో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లండ్‌ను తిరిగి పోటీలోకి తెచ్చారు. 15వ ఓవర్‌లో 18 పరుగులు, ఆ తర్వాతి రెండు ఓవర్లలో వరుసగా 13, 21 రన్స్ సాధించారు. అయితే కాసేపటికే లివింగ్‌స్టోన్ ఔటవ్వడం, ఆఖరి ఓవర్ తొలి బంతికి హ్యారీ బ్రూక్ పెవిలియన్‌కు చేరడంతో..ఇంగ్లండ్ విజయ సమీకరణం చివరి అయిదు బంతులకు 14 పరుగులుగా మారింది.

నోకియా వేసిన రెండో బంతిని ఆర్చర్ సింగిల్ తీయగా, మూడో బాల్‌ను సామ్ కరన్ బౌండరీ బాదాడు. అయితే నాలుగో బంతికి సామ్ కరన్ సింగిల్‌కు నిరాకరించాడు. జోఫ్రా సింగిల్ కోసం ముందుకు వచ్చినప్పటికీ, సామ్ కరన్ స్ట్రైకింగ్ కొనసాగిస్తానని చెప్పాడు. ఆ తర్వాత రెండు బంతుల్లో 9 పరుగులు అవసరమవ్వగా సామ్ కరన్ సింగిల్ తీసి లాస్ట్ బాల్‌కు ఆర్చర్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. ఆఖరి బంతికి ఆర్చర్ పరుగులేమి చేయలేదు.

అయితే ఆర్చర్ స్పెషలిస్టు బ్యాటర్ కానప్పటికీ మంచి హిట్టర్. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఆర్చర్ ఆఖర్లో సిక్సర్లతో హోరెత్తించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ ఆర్చర్‌కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా కరన్ అతి విశ్వాసంతో బ్యాటింగ్ చేసి విజయవంతం కాలేకపోయాడు. ఈ నేపథ్యంలో సామ్ కరన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లండ్ పరాజయానికి సామ్ కరన్ కారణమని, ధోనీలా హీరో అవ్వాలని ట్రై చేసి జీరో అయ్యాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Story first published: Saturday, June 22, 2024, 12:46 [IST]
Other articles published on Jun 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+