వన్డే ప్రపంచప్‌ను చేజార్చుకున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్‌నకు సిద్ధమవుతోంది. అయితే జూన్‌లో జరగనున్న పొట్టి ఫార్మాట్ కప్‌లో భారత జట్టు కూర్పు ఎలా ఉంటుందో, అసలు కెప్టెన్ ఎవరో తెలియన పరిస్థితి ఏర్పడింది. గత టీ20 ప్రపంచకప్ అనంతరం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20లకు దూరమయ్యారు. వన్డే, టెస్టులకు రోహిత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపడుతున్న టీ20లకు మాత్రం హార్దిక్ పాండ్య సారథిగా వ్యవహరిస్తున్నాడు.
అయితే వన్డే ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని స్టార్ క్రికెటర్లు రోహిత్, కోహ్లి గతేడాది పాటు టీ20లకు దూరమై వన్డేలపై శ్రద్ధ పెట్టారు. కానీ మరో అయిదు నెలల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వారిద్దరి టీ20 భవితవ్యంపై చర్చ మొదలైంది. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అందిస్తారా? హార్దిక్ పాండ్యనే సారథిగా కొనసాగిస్తారా? అసలు రోహిత్, కోహ్లి తిరిగి టీ20 జట్టులోకి వస్తారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టీ20 ప్రపంచకప్ జట్టులో తప్పక ఉండాలని గంగూలీ అన్నాడు. అంతేగాక రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని సూచించాడు. అలాగే కోహ్లి ఓ అద్భుతమైన ప్లేయర్ అని దాదా కొనియాడాడు. మరోవైపు టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యగా భావించి స్టార్ స్పోర్ట్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్ షెడ్యూల్ మ్యాచ్‌ల పోస్టర్‌లో హార్దిక్ పాండ్య ఫొటో ఉంచింది.
జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌నకు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తుంది. ఈ మెగాటోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. 20 జట్లకు నాలుగు గ్రూప్‌లుగా విభజించారు.
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్‌ఏ ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్‌లాండ్, ఓమన్ తలపడనున్నాయి. అలాగే గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్, ఉగాండ, పపువా న్యూగెనియా పోటీపడనున్నాయి. ఇక, గ్రూప్-డిలో సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ జట్లు ఉన్నాయి.
జూన్ 1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నాలుగు గ్రూప్‌ల్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. జూన్ 19 నుంచి 24 వరకు సూపర్ 8 మ్యాచ్‌లు జరగుతాయి. టాప్-4లో నిలిచిన జట్లు జూన్ 26(గయానా), జూన్ 27వ తేదీల్లో(ట్రినిడాడ్) సెమీఫైనల్స్ ఆడతాయి. బార్బోడస్ వేదికగా జూన్ 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.
గ్రూప్ స్టేజీలో టీమిండియా షెడ్యూల్:
జూన్ 5: ఇండియా వర్సెస్ ఐర్లాండ్ (న్యూయార్క్)
జూన్ 9: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (న్యూయార్క్)
జూన్ 12: ఇండియా వర్సెస్ యూఎస్ఏ (న్యూయార్క్)
జూన్ 15: ఇండియా వర్సెస్ కెనడా (ఫ్లోరిడా)