Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: ఒరెయ్ పంత్.. బుద్ధుందా? - హార్దిక్‌ కోసం రోహిత్ సీరియస్ (Video)

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ట్రోఫీని అందుకోవడానికి మరో రెండు అడుగుల దూరంలో ఉంది. గ్రూప్, సూపర్-8 స్టేజ్‌లో వరుస విజయాలతో హోరెత్తించి టీమిండియా సెమీఫైనల్‌కు చేరింది. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను తలపడనుంది. ఈ పోరులో విజయం సాధిస్తే ఫైనల్‌కు చేరుతుంది. తుదిపోరులో దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ విజేతతో పోటీపడాల్సి ఉంటుంది.

సూపర్-8‌కు భారత్ అర్హత సాధిస్తుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగలేదు. భారత్ కచ్చితంగా సెమీఫైనల్స్‌కు సునాయాసంగా చేరుకుంటుందని అందరికీ తెలిసిందే. అయితే సూపర్-8 దశలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. ఆస్ట్రేలియా చేతిలో ఓడినా రోహిత్‌సేనకు జరిగే నష్టం పెద్దగా లేదు. టేబుల్‌లో రెండో స్థానంలో నుంచి అయినా సెమీస్‌కు చేరుకుంటుంది.

T20 World Cup Rohit Sharma Gets Serious About Rishabh Pant s Injury to Hardik Pandya

కానీ ఆస్ట్రేలియాను ఇంటికి పంపాలని భారత్ కసిగా ఆడింది. ఆసీస్‌ను చిత్తుగా ఓడించి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌ ఆఖర్లో రిషభ్ పంత్ చేసిన పనితో కెప్టెన్ రోహిత్ శర్మకు కోపం వచ్చింది. పంత్ కారణంగా హార్దిక్ పాండ్య తీవ్రంగా గాయపడేవాడు. కానీ అదృష్టంతో హార్దిక్‌కు గాయమేమి కాలేదు. దీంతో పంత్‌పై రోహిత్ సీరియస్ అయ్యాడు. కొంచమైనా బుద్ధుందా అంటూ పంత్‌ను తిట్టాడు.

అసలేం జరిగిదంటే.. ఆఖరి ఓవర్‌ను హార్దిక్ పాండ్య బౌలింగ్ చేశాడు. అప్పటికే భారత్ విజయం ఖరారైంది. స్ట్రైకింగ్‌లో ఉన్న స్టార్క్ బై రూపంలో సింగిల్ తీయాలనుకున్నాడు. దీంతో వికెట్ కీపర్ పంత్ వేగంగా త్రో విసిరాడు. అది హార్దిక్ చేతికి బలంగా తాకింది. ఆ సమయంలో భారత్‌కు వికెట్‌తో పనేలేదు. కానీ పంత్ అత్యుత్సాహం చూపించాడు. అది హార్దిక్ గాయమయ్యే ప్రమాదాన్ని సృష్టించింది.

టీ20 వరల్డ్ కప్‌లో హార్దిక్ భారత్‌కు ప్రధాన బలంగా మారాడు. బ్యాటుతో పాటు బంతితోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో హార్దిక్‌కు గాయమై జట్టుకు దూరమైతే అది టీమిండియాకు ప్రతికూలంగా మారుతుంది. దీంతో పంత్‌పై రోహిత్ సీరియస్ అయ్యాడు. కొంచెం ఆలోచించి చేయంటూ రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌‌గా మారింది.

Story first published: Wednesday, June 26, 2024, 10:03 [IST]
Other articles published on Jun 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+