వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి భారత్ సిద్ధమైంది. సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో రోహిత్ సేన ఇవాళ సూపర్-8లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే టీమిండియా నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తుంది. మరోవైపు అఫ్గానిస్థాన్ చేతిలో ఓడిన ఆస్ట్రేలియాకు ఇది డూ ఆర్ డై మ్యాచ్. అయితే విజయం సాధించినా ఆసీస్ సెమీస్ ఆశలకు నెట్‌రన్‌రేటు ఎంతో కీలకం కానుంది.
అయితే టీ20 వరల్డ్ కప్‌లో ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ఆటంకం కలిగేలా ఉంది. మ్యాచ్‌కు ముందు, జరిగే సమయంలో సెయింట్ లూసియాలో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. భారత్ కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్థానిక కాలమాన ప్రకారం అది ఉదయం 10.30 గంటలకు. అయితే అక్కడ ఉదయం 7 నుంచి 9 గంటల మధ్యలో భారీ వర్షం పడే అవకాశాలు 65 శాతం ఉన్నాయి.

అంతేగాక మధ్యాహ్నం కూడా వరుణుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మ్యాచ్ సజావుగా సాగే పరిస్థితులూ లేవు. ఇరు జట్లు కనీసం అయిదు ఓవర్లు కూడా ఆడే పరిస్థితి లేకపోతే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారు. అలా జరిగితే భారత్ అయిదు పాయింట్లతో గ్రూప్-1 టేబుల్ టాపర్‌గా సెమీఫైనల్‌కు చేరుతుంది.
మరోవైపు ఆస్ట్రేలియా సూపర్-8 స్టేజ్‌ను మూడు పాయింట్లతో ముగిస్తుంది. ఈ సందర్భంలో బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధిస్తే.. ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎలా అంటే బంగ్లాపై గెలిచిన అఫ్గాన్ నాలుగు పాయింట్లతో నిలుస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ చేతిలో అఫ్గాన్ ఓటమిపాలైతే ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది. ఈ సందర్భంలో అఫ్గాన్, బంగ్లాదేశ్ రెండు పాయింట్లకే పరిమితం అవుతాయి. ఇది కంగారూలకు కలిసొస్తుంది. కాగా, భారత్-ఆసీస్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్, కమిన్స్, మిచెల్ స్టార్క్, జంపా, హేజిల్‌వుడ్.