Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ENG vs WI: సాల్ట్ ఊచకోత.. ఒకే ఓవర్‌లో 30 పరుగులు (Video)

సూపర్-8లో ఇంగ్లండ్ ఘనంగా బోణీ కొట్టింది. సెయింట్ లూసియా వేదికగా గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటి గ్రూప్-2లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 180 పరుగులు చేసింది.
జాన్సన్ చార్లెస్ (38; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.

పావెల్ (36; 17 బంతుల్లో, 5 సిక్సర్లు), రూథర్‌ఫర్డ్ (28 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్) దూకుడుగా ఆడారు. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, ఆర్చర్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (87 నాటౌట్; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్; 26 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

T20 World Cup Philip Salt Smashes 30 Runs in a Single Over Off Romario Shepherd

ఛేదనలో ఆది నుంచే ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. పవర్‌ప్లేలో 58/0తో శుభారంభం చేసింది. బట్లర్ (25; 22 బంతుల్లో, 2 ఫోర్లు), మొయిన్ అలీ (13; 10 బంతుల్లో, 2 ఫోర్లు) స్వల్ప వ్యవధిలో ఔటైనప్పటికీ బె‌యిర్‌స్టోతో కలిసి సాల్ట్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అయితే ఇంగ్లండ్ విజయానికి చివరి అయిదు ఓవర్లలో 40 పరుగులు అవసరమవ్వగా.. సాల్ట్ ఊచకోతకు దిగాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 16వ ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు సాధించాడు.

మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో చెలరేగాడు. తొలి బంతిని ఎక్సట్రా కవర్ మీదుగా ఫోర్ బాదిన సాల్ట్ రెండో బంతిని బౌలర్ తలమీదుగా సిక్సర్ బాదాడు. స్లో షార్టర్‌గా వేసిన మూడో బంతిని అప్పర్‌కట్‌తో వికెట్ కీపర్ మీదుగా బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత లాంగాఫ్ మీదుగా సాల్ట్ భారీ సిక్సర్ బాదాడు. షెఫర్డ్ వేసిన మరో షార్ట్ బాల్‌ను డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ మీదుగా స్టన్నింగ్ సిక్సర్ సాధించాడు. ఇక ఫుల్ టాస్‌గా వచ్చిన ఆఖరి బంతిని సునాయాసంగా మిడాఫ్ మీదుగా ఫోర్ కొట్టాడు. దీంతో 16వ ఓవర్‌లో వరుసగా 4, 6, 4, 6, 6, 4 వచ్చాయి.

ఈ క్రమంలో షెఫర్డ్ చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆరో బౌలర్‌గా, వెస్టిండీస్ తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో తొలి రెండు స్థానాల్లో స్టువర్ట్ బ్రాడ్ (36 పరుగులు, ఇంగ్లండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (36 పరుగులు, అఫ్గానిస్థాస్) ఉన్నారు.

Story first published: Thursday, June 20, 2024, 10:28 [IST]
Other articles published on Jun 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+