Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: కమిన్స్ ఆల్‌టైమ్ రికార్డు.. క్రికెట్ చరిత్రలో ఫస్ట్ టైమ్! (Video)

టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకు ఊహించని పరాభవం ఎదురైంది. కింగ్స్‌టౌన్‌లోని సెయింట్ విన్సెంట్ వేదికగా ఆదివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో ఆసీస్ ఓటమిపాలైంది. అఫ్గాన్ చేతిలో కంగారూలకు ఇదే తొలి ఓటమి.మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 148 పరుగులు చేసింది.

అఫ్గాన్ ఓపెనర్లు గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో, 6 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. ప్యాట్ కమిన్స్ (3/28) హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఆడమ్ జంపా (2/28) రెండు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది.

T20 World Cup Pat Cummins Makes History with Consecutive Hat-Tricks in T20Is

గుల్బాదిన్ నైబ్ (4/20) నాలుగు, నవీనుల్ హక్ (3/20) మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. గ్లెన్ మాక్స్‌వెల్ (59; 41 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడారు. అయితే బంగ్లాదేశ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పాటు అఫ్గానిస్థాన్ పోరులో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన ప్యాట్ కమిన్స్ అరుదైన రికార్డు సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో వరుస మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన తొలి బౌలర్‌‌గా కమిన్స్ చరిత్రకెక్కాడు.

అంతేగాక మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో రెండు సార్లు హ్యాట్రిక్ సాధించిన ఏకైక బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు ఎనిమిది సార్లు హ్యాట్రిక్ నమోదైంది. 2007 ప్రపంచకప్‌లో బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) తొలి సారి ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత కర్టిస్ క్యాంపర్ (ఐర్లాండ్- 2021), హసరంగ (శ్రీలంక- 2021), రబాడ (దక్షిణాఫ్రికా- 2021), కార్తీక్ మెయ్యపన్ (యూఏఈ- 2022), జోషువ లిటిల్ (ఐర్లాండ్- 2022) హ్యాట్రిక్ వికెట్లు నమోదుచేశారు.

ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా కమిన్స్ రికార్డులకెక్కాడు. 1999లో టెస్టుల్లో పాకిస్థాన్ బౌలర్ వసీమ్ అక్రమ్ శ్రీలంకపై వరుస మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే 1912లో ఆస్ట్రేలియా బౌలర్ జిమ్మీ మాథ్యూస్ సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో హ్యాట్రిక్ సాధించాడు.

Story first published: Sunday, June 23, 2024, 12:10 [IST]
Other articles published on Jun 23, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+