Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పతిరనా బుల్లెట్ యార్కర్.. బిత్తరపోయిన క్లాసెన్ (Video)

టీ20 వరల్డ్ కప్-2024లో దక్షిణాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. నాసా కంట్రీ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్లో పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో స్వల్ప స్కోరులు నమోదైనప్పటికీ మ్యాచ్ హోరాహోరీగానే సాగింది. లక్ష్యాన్ని సాధించడానికి సౌతాఫ్రికా చెమటోడ్చింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.1 ఓవర్లలో 77 పరుగులకే ఆలౌటైంది. ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ (19; 30 బంతుల్లో, 1 ఫోర్), మాథ్యూస్ (16; 16 బంతుల్లో, 2 ఫోర్లు), కామిందు మెండిస్ (11; 15 బంతుల్లో, 1 ఫోర్) మినహా మిగిలిన లంక బ్యాటర్లెవరూ రెండంకెల స్కోరు సాధించలేకపోయారు. నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు.

T20 World Cup Matheesha Pathirana s Bullet Yorker Leaves Heinrich Klaasen Stunned

సఫారీ బౌలర్లలో నోకియా నాలుగు వికెట్లతో విజృంభించాడు. నాలుగు ఓవర్లలో కేవలం ఏడు పరుగులే ఇచ్చి కీలక వికెట్ల పడగొట్టాడు. రబాడ (2/21), కేశవ్ మహరాజ్ (2/22) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనకు వచ్చిన దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్యాన్ని అందుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. 16.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించింది.

క్వింటన్ డికాక్ (20; 27 బంతుల్లో , 1 సిక్సర్), హెన్రిచ్ క్లాసెన్ (19 నాటౌట్, 22 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), ట్రిస్టన్ స్టబ్స్ (13; 28 బంతుల్లో), మార్క్‌రమ్ (12; 14 బంతుల్లో, 1 సిక్సర్) పరుగులు చేశారు. లంక బౌలర్లలో హసరంగ రెండు, నువాన్ తుషార, షనక తలో వికెట్ తీశారు. అయితే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లంక పేసర్ పతిరనా వేసిన యార్కర్ వీడియో నెట్టింట వైరల్ మారింది.

12వ ఓవర్‌‌లో విధ్వంసకర బ్యాటర్ క్లాసెన్‌కు పతిరనా బుల్లెట్ లాంటి యార్కర్‌ను సంధించాడు. దాన్ని అతి కష్టంగా వికెట్లను తాకకుండా క్లాసెన్ కాపాడుకున్నాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకుని బంతి అతని ప్యాడ్లకు బలంగా తాకింది. ఈ క్రమంలో క్లాసెన్ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఆ తర్వాత లేచి సింగిల్ తీశాడు. వికెట్ సాధించకపోయినప్పటికీ పతిరనా యార్కర్‌ను క్రికెట్ విశ్లేషకులు కొనియాడుతున్నారు.

Story first published: Tuesday, June 4, 2024, 17:14 [IST]
Other articles published on Jun 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+