Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మలుపుతిప్పిన మార్క్‌రమ్ స్టన్నింగ్ క్యాచ్‌.. ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం (Video)

టీ20 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా వరుస విజయాలతో హోరెత్తిస్తోంది. సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. సూపర్-8లో వరుసగా రెండో విజయం సాధించి సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 163 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ డికాక్ (65; 38 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

డేవిడ్ మిల్లర్ (43; 28 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పరుగులు చేశాడు. జోఫ్రా ఆర్చర్ (3/40) మూడు వికెట్లు తీశాడు. అయితే దక్షిణాఫ్రికాకు లభించింన శుభారంభానికి సునాయాసంగా 200 స్కోరు సాధించేలా కనిపించింది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి స్కోరు వేగాన్ని తగ్గించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆది నుంచి దూకుడుగా ఆడింది. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (19; 25 బంతుల్లో, 1 ఫోర్) జాగ్రత్తగా ఆడినా డికాక్ చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేలో 63 పరుగులు వచ్చాయి.

T20 World Cup Markram s Stunning Catch Seals Victory for South Africa Over England

ఆ తర్వాత ఇంగ్లండ్ స్పిన్నర్లు బంతిని అందుకోవడంతో స్కోరువేగం తగ్గింది. 9.4 ఓవర్లకు 86/0తో మెరుగైన స్థితిలో ఉన్న సౌతాఫ్రికా 15 ఓవర్లకు 115/4తో నిలిచింది. కానీ మిల్లర్ పోరాటంతో ఇంగ్లండ్ ముందు సఫారీ సేన సవాలైన లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ఇంగ్లండ్‌కు 164 పరుగుల లక్ష్యం సరిపోతుందా అనే సందేహాలు పెరిగాయి. కానీ స్లోపిచ్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ ఛేదనలో 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది.

కేశవ్ మహరాజ్ (2/25), రబాడ (2/32) చెలరేగడంతో ఇంగ్లండ్ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన లివింగ్‌స్టోన్ (33; 17 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)తో కలిసి హ్యారీ బ్రూక్ (53; 37 బంతుల్లో) ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీరిద్దరు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపు తిప్పారు. రబాడ వేసిన 15వ ఓవర్‌లో 18 పరుగులు, బార్ట్‌మన్ వేసిన 17వ ఓవర్‌లో 21 పరుగులు సాధించడంతో ఇంగ్లండ్ విజయ సమీకరణం 18 బంతుల్లో 25 పరుగులుగా మారింది.

ఆ తర్వాత లివింగ్‌స్టోన్‌ను ఔట్ చేసి రబాడ నాలుగు పరుగులే ఇచ్చాడు. దీంతో ఇంగ్లండ్ విజయానికి ఆఖరి ఆరు బంతుల్లో 14 పరుగులు అవసరమయ్యాయి. కుదురుకున్న హ్యారీ బ్రూక్ స్ట్రైకింగ్‌లో ఉండటంతో ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు ఉన్నాయి. నోకియా వేసిన తొలి బంతిని మిడాఫ్ మీదుగా బ్రూక్ బౌండరీకి యత్నించాడు. మార్క్‌రమ్ వెనక్కి పరిగెత్తుతూ స్టన్నింగ్ క్యాచ్ అందుకోవడంతో మ్యాచ్ తిరిగి దక్షిణాఫ్రికా చేతుల్లోకి వచ్చింది. సామ్ కరన్ (10 నాటౌట్; 7 బంతుల్లో, 1 ఫోర్) తర్వాత పోరాడినా సౌతాఫ్రికానే విజయం సాధించింది.

Story first published: Saturday, June 22, 2024, 8:11 [IST]
Other articles published on Jun 22, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+