T20 World Cup 2021: మెరిసిన స్మిత్.. దక్షిణాఫ్రికాపై ఘన విజయం! ప్రపంచకప్‌లో బోణీ ఆస్ట్రేలియాదే!!

అబుదాబి: టీ20 ప్రపంచకప్ 2021 తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికాపై ఆసీస్ పై చేయి సాధించింది. 119 పరుగల స్వల్ప లక్ష్యం అయినా ఆఖరి ఓవర్ వరకూ సాగిన థ్రిల్లర్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ విజయాన్ని అందుకుంది. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ టాప్ స్కోరర్. 34 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 35 పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరలో మార్కస్ స్టోయినిస్ (24), వేడ్ (15) పరుగులు చేసి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, మహారాజ్, శంసి తలో వికెట్ పడగొట్టారు.
ఆదిలోనే భారీ షాక్:
119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ ఆరోన్ ఫించ్ డకౌట్ అయ్యాడు. డేవిడ్ వార్నర్ (14), మిచెల్ మార్ష్ (11) కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. దాంతో ఆసీస్ 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టును ఆదుకున్నారు. ఈ జోడి నాలుగో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించిచింది. 34 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసిన స్మిత్.. నోర్జ్ బౌలింగ్‌లో మార్క్‌రమ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్ కూడా రివర్స్ స్వీప్‌కి ప్రయత్నించి షంసీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో మ్యాచ్ ఉత్కంఠకు దారి తీసింది.
స్టోయినిస్, వేడ్ కలిసి:
అయితే ఆఖర్లో గ్లేన్ మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ కలిసి పోరాడారు. 24 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన దశలో కాగిసో రబాడా వేసిన 17వ ఓవర్‌లో వేడ్ 11 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత పెట్రోరియస్ వేసిన 18వ ఓవర్లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. నోర్జ్ వేసిన 19వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఖరి 6 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన స్థితిలో మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. తర్వాతి బౌండరీ రావడంతో సీన్ పూర్తి ఆసీస్‌వైపు మళ్లింది. ఇక నాలుగో బంతికి మరో బౌండరీ రావడంతో ఆసీస్ విజయాన్ని అందుకుంది.
ఆదుకున్న మార్క్రామ్:
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. ప్రోటీన్ ఓపెనర్లు క్వింటన్ డికాక్ (7: 12 బంతుల్లో 1x4), తెంబా బవుమా (12: 7 బంతుల్లో 2x4) పేలవరీతిలో వికెట్లు చేజార్చుకున్నారు. ఆపై వాన్ డెర్ డ్యూసెన్ కూడా విఫలమయ్యాడు. స్టార్ బ్యాటర్ డ్యూసెన్ మూడు బంతులల్లో 2 రన్స్ చేశాడు. ఈ సమయంలో ఐడెన్ మార్క్రామ్ జట్టును ఆదుకున్నాడు. 36 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు.హెన్రిచ్ క్లాసెన్ (13: 13 బంతుల్లో 2x4) అండతో మార్క్రామ్ పరుగులు చేశాడు. దీంతో ప్రొటీస్ స్కోర్ బోర్డు ముందుకు కదిలింది.
బ్యాట్ జులిపించిన రబాడ:
అయితే ఒకవైపు మార్క్రామ్ పోరాడుతున్నా.. డేవిడ్ మిల్లర్ (16: 18 బంతుల్లో), ప్రిటోరియస్ (1) తక్కువ స్కోరుకే ఔటవడంతో దక్షిణాఫ్రికా కనీసం 100 పరుగుల మార్కుని కూడా చేరేలా కనిపించలేదు. కానీ చివర్లలలో పట్టుదలతో క్రీజులో నిలిచిన పేస్ బౌలర్ కాగిసో రబాడ.. దక్షిణాఫ్రికా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అతడు ఆఖరి ఓవర్‌లో ఓ సిక్స్ కూడా కొట్టడం విశేషం. రబాడ బ్యాట్ జులిపించడంతో ప్రొటీస్ స్కోర్ 100 దాటింది. మొత్తంగా సఫారీ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. టీ20 ప్రపంచకప్ 2021లోని మొదటి మ్యాచే అభిమానులను నిరాశపరిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications