Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ మాంత్రికుడి దెబ్బకే ఇంగ్లండ్ ఇంటికి!- సచిన్

వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ టీ20 వరల్డ్ కప్‌కు చేరువైంది. ట్రోఫీని ముద్దాడాటానికి మరో అడుగు దూరంలో నిలిచింది. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా శనివారం తలపడనుంది.

అయితే సెమీస్‌లో భారత్ చరిత్రలో నిలిచిపోయేలా విజయఢంకా మోగించింది. 2022లో ఇంగ్లండ్ చేతిలో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా టీమిండియా చెలరేగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (9), రిషభ్ పంత్ (4) విఫలమైనా కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు.

T20 World Cup Kuldeep s Wizardry Spun England Out - Sachin on India s Grand Victory in Semis

ఆఖర్లో హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్‌దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు.

కాగా, ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన ఘన విజయానికి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఫిదా అయ్యాడు. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన టీమిండియాను మెచ్చుకున్నాడు. కఠినపిచ్‌పై బ్యాటర్లు సగటు స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించగా, భారత బౌలర్లు మిగిలిన పనిని గొప్పగా పూర్తిచేశారని అన్నాడు. ''సవాలైన పిచ్‌పై భారత్ అద్భుతంగా 171 పరుగులు సాధించింది. అక్షర్ పటేల్ తన మొదటి మూడు ఓవర్లలో తొలి బంతికే కీలక వికెట్లు పడగొట్టాడు. ఇక మిడిల్ ఓవర్ల మాంత్రికుడు కుల్‌దీప్ యాదవ్ దెబ్బకు ఇంగ్లండ్ ఔట్ అయిపోయింది''

''పిచ్ సగటు స్కోరు 167 కంటే భారత్ కొన్ని ఎక్కువ పరుగులే చేసింది. అయితే మన బౌలింగ్ అంతకంటే గొప్పగా సత్తాచాటింది. ఇది సమష్టి విజయం'' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశాడు. మూడో ఓవర్‌లో బంతిని అందుకున్న అక్షర్ తొలి బంతికే డేంజర్ బ్యాటర్ బట్లర్ (23; 15 బంతుల్లో, 4 ఫోర్లు)ను ఔట్ చేశాడు. ఆ తర్వాత తన తర్వాతి రెండు ఓవర్ల మొదటి బంతికి బెయిర్‌స్టో (డకౌట్), మొయిన్ అలీ (8; 10 బంతుల్లో) పెవిలియన్‌కు చేర్చాడు.

Story first published: Friday, June 28, 2024, 9:00 [IST]
Other articles published on Jun 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+