టీ20 వరల్డ్ కప్‌లో భారత్ వరుస విజయాలతో సత్తాచాటుతోంది. లీగ్ దశను దర్జాగా దాటిన భారత్ సూపర్-8 స్టేజ్‌లోనూ హోరెత్తిస్తోంది. ఆంటిగ్వా వేదికగా శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో సెమీస్ అవకాశాలు మరింత మెరుగుపర్చుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 196 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (50 నాటౌట్; 27 బంతుల్లో, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (37; 28 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు), రిషభ్ పంత్ (36; 24 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), శివమ్ దూబె (34; 24 బంతుల్లో, 3 సిక్సర్లు) సత్తాచాటారు. బంగ్లా బౌలర్లలో తన్జీమ్ హసన్ సకిబ్ (2/32), రిషద్ హొస్సేస్ (2/43) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ షాంటో (40; 32 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. కుల్‌దీప్ యాదవ్ (3/19) మూడు వికెట్లు, జస్‌ప్రీత్ బుమ్రా (2/13), అర్షదీప్ సింగ్ (2/30) రెండు వికెట్లతో సత్తాచాటారు. అయితే ఈ మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. విరాట్ కోహ్లిని ఔట్ చేసిన తర్వాత తన్జీమ్ హసన్ సకీబ్ హద్దులు దాటుతూ సంబరాలు చేసుకున్నాడు. కోహ్లి వైపు ఆవేశంగా చూస్తూ అరుస్తూ అతిగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ప్రత్యర్థి కవ్విస్తే సాధారణంగా అంత ఈజీగా వదిలిపెట్టని కోహ్లి.. ఈ సారి మాత్రం తన్జీమ్‌ను పట్టించుకోకుండా మైదానాన్ని వీడాడు. అయితే బంగ్లాదేశ్ ప్లేయర్లు ఔటైన తర్వాత కోహ్లి తనదైన రీతిలో సెలబ్రేషన్స్ చేస్తాడనుకుంటే సీన్ రివర్స్ అయ్యింది. కోహ్లి వికెట్ పడితే సంతోషించాడే తప్పే తన ట్రేడ్ మార్క్ సెలబ్రేషన్స్ చేయలేదు. అయితే కోహ్లికి బదులుగా కుల్‌దీప్ యాదవ్ మైదానంలో దూకుడుగా మారాడు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థి బ్యాటర్ దగ్గరకు వెళ్లి కవ్వించేలా సెలబ్రేషన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కోహ్లికి బదులుగా కుల్‌దీప్ ప్రతీకారం తీర్చుకుంటున్నాడని, ఇది కదా మాస్ రివెంజ్ అంటూ కామెంట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.