For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: బట్లర్ ఊచకోత.. ఒకే ఓవర్ 5 సిక్సర్లు: యువీ రికార్డు జస్ట్ మిస్! (Video)

బార్బడోస్ వేదికగా అమెరికాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బట్లర్ విధ్వంసం సృష్టించాడు. 38 బంతుల్లో అజేయంగా 83 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో హర్మీత్ సింగ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో అయిదు సిక్సర్లు బాదాడు. బట్లర్‌తో పాటు ఫిలిప్ సాల్ట్ (25 నాటౌట్; 21 బంతుల్లో, 2 ఫోర్లు) కూడా సత్తాచాటడంతో అమెరికాపై ఇంగ్లండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఈ విజయంతో ఇంగ్లండ్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. కాగా, మొదట బ్యాటింగ్‌ చేసిన అమెరికా 18.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌటైంది. నితీశ్ కుమార్ (30; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (4/10) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. జోర్డాన్ ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లతో రికార్డు నెలకొల్పాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం విశేషం. ఆదిల్ రషీద్ (2/13), సామ్ కరన్ (2/23) చెరో రెండు వికెట్లు తీశారు.

T20 World Cup Jos Buttler s Brutal Assault on USA with Five Sixes in an Over

ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి 115/5తో ఉన్న యూఎస్‌ఏ ఆ తర్వాత పరుగులేమి చేయకుండా 115 పరుగుల వద్దే ఆలౌటైంది. టీ20 క్రికెట్ చరిత్రలో ఇలా జరగడం మూడో సారి. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయతీరాలకు చేరింది. ఛేజింగ్‌లో తొలి రెండు ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 6/0 మాత్రమే. కానీ ఆ తర్వాత బట్లర్ ఊచకోత మొదలుపెట్టాడు.

హర్మీత్ సింగ్ వేసిన 8వ ఓవర్‌లో బట్లర్ విధ్వంసం సృష్టించాడు. అయిదు సిక్సర్లు బాది ఏకంగా 32 పరుగులు పిండుకున్నాడు. తొలి బంతికి ఫిలిప్ సాల్ట్ సింగిల్ తీయడంతో బట్లర్‌కు స్ట్రైకింగ్ వచ్చింది. బట్లర్ వరుసగా నాలుగు సిక్సర్లు బాదాడు. దీంతో ఒత్తిడిలోకి వెళ్లిన బౌలర్ వైడ్ వేశాడు. అనంతరం ఆఖరి బంతిని బట్లర్ వదిలిపెట్టలేదు. లాంగాన్ మీదుగా బంతిని స్టాండ్స్‌కు తరలించాడు. ఫిలిప్ సాల్ట్ తొలి బంతి ఎదుర్కోకపోతే యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సర్ల రికార్డును బట్లర్ బ్రేక్ చేసేవాడేమో! 2007 టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో యువీ ఈ ఘనత సాధించిన విషయం తెలిసిందే.

Story first published: Monday, June 24, 2024, 9:26 [IST]
Other articles published on Jun 24, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+