For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా మెంటార్‌గా ధోనీ అపాయింట్ వెనక పెద్ద కథే ఉందిగా: ట్రబుల్ షూటర్ రోల్

T20 World Cup: Is MS Dhoni brought in to control rift between Kohli and senior cricketers?
T20 World Cup : MS Dhoni Was Appointed To Settle Clashes Between The Players

అబుధాబి: టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ కేరీర్‌లో ఈ సంవత్సరం అత్యంత కీలకంగా మారింది. అతని కేప్టెన్సీలోనే టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ఆడబోతోంది భారత క్రికెట్ జట్టు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే మరో మేజర్ ఈవెంట్‌లో టీమిండియా పార్టిసిపేట్ చేస్తోంది. 2019 వరల్డ్ కప్‌లో చోటు చేసుకున్న పొరపాట్లు మళ్లీ రిపీట్ కాకూడదని భావిస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). క్రికెట్ ప్రపంచంపై సాగిస్తోన్న ఆధిపత్యం చేజారకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది.

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో..

డబ్ల్యూటీసీ ఫైనల్ ఓటమితో..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడంతో మళ్లీ.. ఒక్కసారిగా ఈ విభేదాలు తెరమీదకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లాండ్‌లో నార్తాంప్టస్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్‌లో కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్‌ను ఎదుర్కొన్న టీమిండియా ఘోరంగా ఓడిపోయింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్‌లో 217, రెండో ఇన్నింగ్‌లో 170 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది కివీస్ టీమ్.

కోహ్లీ కేప్టెన్సీ మీద డ్రెస్సింగ్ రూమ్‌లో హీట్..

కోహ్లీ కేప్టెన్సీ మీద డ్రెస్సింగ్ రూమ్‌లో హీట్..

ఈ మ్యాచ్ ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో వాతావరణం వేడెక్కిందని, కేప్టెన్‌గా విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన వ్యూహాలు దారుణంగా తిప్పి కొట్టాయంటూ కొందరు సీనియర్ ఆటగాళ్లు అసహనాన్ని వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు ఈ విషయాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కార్యదర్శి జయ్ షా దృష్టికి తీసుకెళ్లారని, మ్యాచ్‌లో ఓడిపోవడానికి గల కారణాలను వారు వివరించారని అంటున్నారు. రవిచంద్రన్ అశ్విన్, చేతేశ్వర్ పుజారా, అజింక్యా రహానె బీసీసీఐ కార్యదర్శిని కలిశారని తెలుస్తోంది. దీన్ని బీసీసీఐ తోసిపుచ్చినా.. కారణాలు మాత్రం

మిగిలిన క్రికెటర్లతోనూ..

మిగిలిన క్రికెటర్లతోనూ..

ఆ ఇద్దరు సీనియర్ క్రికెటర్ల నుంచి కంప్లయిట్లను అందుకున్న తరువాత.. జయ్ షా- ఇతర ప్లేయర్లతోనూ మాట్లాడాడని చెబుతున్నారు. వారు కూడా ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో ఓ రిపోర్ట్‌ను తయారు చేయించాడని తెలుస్తోంది. ఆ తరువాతే- వన్డే, టీ20 ఫార్మట్ క్రికెట్ జట్టుకు విరాట్ కోహ్లీ కేప్టెన్‌ హోదా నుంచి తప్పుకొంటాడనే వార్తలు వచ్చాయి.. ఈ వార్తలను తొలుత బీసీసీఐ తోసిపుచ్చింది. విరాట్ కోహ్లీని తప్పించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసింది. బీసీసీఐ క్లారిటీ ఇచ్చిన కొద్దిరోజులకే విరాట్ కోహ్లీ స్వచ్ఛందంగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తాను కేప్టెన్సీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించాడు.

ఈ విభేదాల ఎఫెక్ట్‌పై జట్టుపై పడకుండా..

ఈ విభేదాల ఎఫెక్ట్‌పై జట్టుపై పడకుండా..

ఈ విభేదాలు, మనస్పర్థల ప్రభావం జట్టు విజయాలపై పడకుండా ఉండటానికే బీసీసీఐ పెద్దలు.. టీమిండియా మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని పిలిపించారని అంటున్నారు. మెంటార్‌గా నియమించడానికి అదే ప్రధాన కారణమని చెబుతున్నారు. జట్టులోని సీనియర్ ప్లేయర్లు, విరాట్ కోహ్లీకి మధ్య సమన్వయం సాధించేలా ధోనీ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్‌కు ఎంపికైన ప్రతి ఒక్క టీమిండియా ప్లేయర్‌కు కూడా ధోనీ అంటే ఓ గౌరవ భావం ఉంది. అతన్ని పెద్దన్నలా భావిస్తారు. అందుకే- ఈ కోల్డ్ వార్ అంటూ ఏదైనా ఉంటే దాన్ని రూపుమాపడానికి ధోనీ సహకరిస్తాడని, జట్టులో స్ఫూర్తి నింపడానికి దోహదపడతాడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.

Story first published: Thursday, September 30, 2021, 9:20 [IST]
Other articles published on Sep 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+