Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!

టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఫ్లోరిడాలోని లాడర్‌హిల్‌లో కెనడాతో శనివారం తలపడనుంది. ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించిన టీమిండియా లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఈ మెగాటోర్నీలో ఇప్పటివరకు భారత్ ఓటమెరుగని విషయం తెలసిందే.

ఈ ప్రపంచకప్‌లో భారత్ ఆడిన మూడు మ్యాచ్‌‌లు న్యూయార్క్‌లోని నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలోనే జరిగాయి. ఈ వేదికలోని మందకొడి పిచ్‌పై భారత బ్యాటర్లు పరుగుల కోసం ఎంతో శ్రమించారు. అయితే లాడర్‌హిల్‌లోని బ్రోవార్డ్ స్టేడియం బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. దీంతో టీమిండియా ధనాధన్ బ్యాటింగ్‌ను కెనడా మ్యాచ్‌లో చూడొచ్చని అభిమానులు ఎన్నో ఆశలతో ఉన్నారు. కానీ ఫ్యాన్స్ ఆశలకు వరుణుడు చెక్ పెట్టాలనుకుంటున్నాడు.

T20 World Cup India vs Canada Likely to be Washed Out in Lauderhill

ఇవాళ జరగనున్ను భారత్-కెనడా మ్యాచ్‌కు వర్షం ముంపు పొంచి ఉంది. ఉరుములతో కూడా భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని స్థానిక వాతావరణ శాఖ పేర్కొంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 50 శాతం వర్షం కురిసే ఛాన్స్‌లు ఉన్నాయని తెలిపింది. అంతేకాదు, మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తాడని హెచ్చరించింది. దీంతో మ్యాచ్ జరగడం దాదాపు అసాధ్యమే! లాడర్‌హిల్‌లో శుక్రవారం జరగాల్సిన అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్‌ కూడా వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే.

ఒక వేళ కెనడాతో జరిగే మ్యాచ్ రద్దయినా భారత్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. ఇప్పటికే ఆరు పాయింట్లతో గ్రూప్-ఏ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఖాతాలో మరో పాయింట్ చేరుతుంది. లీగ్ దశను టాపర్‌గానే ముగిస్తుంది. మరోవైపు కెనడా మూడు పాయింట్లో మూడో స్థానానికి ఎగబాకి పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టేస్తుంది. ప్రస్తుతం అమెరికా (5), పాకిస్థాన్ (2), కెనడా (2).. భారత్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్న విషయం తెలిసిందే.

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), జైస్వాల్, విరాట్ కోహ్లి, సంజు శాంసన్, రిషభ్ పంత్ , సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, కుల్‌దీప్, జడేజా, చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్

కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్, పర్గాత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ, రవీంద్రపాల్ సింగ్, సాద్ బిన్ జఫార్ (కెప్టెన్), కలీమ్, హేలిగర్, జునైద్, గొర్డాన్, రయ్యాన్ పఠాన్, నిఖిల్ దత్తా, రాఘవ్ జోషి, దీల్‌ప్రీత్.

Story first published: Saturday, June 15, 2024, 11:50 [IST]
Other articles published on Jun 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+