టీ20 వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గయానా వేదికగా గురువారం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు.
హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు. క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్‌దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు.

అయితే ఈ క్రమంలో భారత్ పలు రికార్డులు బ్రేక్ చేసింది. 2014 టీ20 వరల్డ్ కప్ అనంతరం నాకౌట్ మ్యాచ్‌ల్లో డిఫెండ్ చేసి గెలిచిన జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. 2014 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో శ్రీలంక లక్ష్యాన్ని కాపాడుకుని ఫైనల్‌కు చేరింది. డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో వెస్టిండీస్‌పై లంక 27 పరుగుల తేడాతో గెలిచింది. ఆ తర్వాత నుంచి పొట్టి కప్‌లో నాకౌట్ గేమ్స్‌లో ఏ జట్టు లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. అనంతరం 12 సార్లు ఛేజింగ్ చేసిన టీమే గెలిచింది. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 172 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుని విజయతీరాలకు చేరింది.
మరోవైపు టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో (ఫైనల్, సెమీఫైనల్స్)లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని ఓ జట్టు ఓడిపోవడం ఇది రెండోసారి. 2009లో వెస్టిండీస్, ఇప్పుడు ఇంగ్లండ్ ఓటమిపాలైంది. కాగా, టీ20 నాకౌట్స్‌లో పరుగుల పరంగా ఇది రెండో భారీ విజయం. భారీ విజయాల జాబితాలో టాప్-3లో వెస్టిండీస్ (74 పరుగులు, ఆస్ట్రేలియాపై-2012), భారత్ (68 పరుగులు, ఇంగ్లండ్‌పై- 2024), శ్రీలంక (57 పరుగులు, వెస్టిండీస్‌పై-2009) ఉన్నాయి.