Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచకప్‌ వాయిదా.. ‌ తెరపైకి ఐపీఎల్‌ 2020!!

T20 World Cup in Australia Set to Be Postponed, Offical Announcement This Week
T20 World Cup in Australia All Set To Be Postponed

ముంబై: మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్‌ ఈ ఏడాదికి రద్దే అని నిన్నటివరకూ అందరూ భావించారు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అంతేకాదు అవి ఇప్పుడు బీసీసీఐకి అనుకూలంగా మారుతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‌ వాయిదా?:

టీ20 ప్రపంచకప్‌ వాయిదా?:

ఈ నెల 26 నుంచి 28 వరకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఐసీసీ సమావేశాలు జరగనున్నాయి. టీ20 ప్రపంచకప్‌ వాయిదా, ఐసీసీ ఛైర్మన్‌ పదవికి నామినేషన్లు, ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వాయిదాపై ఆతిథ్య క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా సుముఖంగానే ఉన్న‌ట్లు స‌మాచారం. ఖాళీ స్టేడియంలో టోర్నీని నిర్వ‌హించ‌డం ద్వారా బారీగా టికెట్ రెవెన్యూ న‌ష్ట‌పోతామ‌ని సీఏ భావిస్తోంది. ఇక ప్రపంచకప్‌ వాయిదా పడితే మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్నది ఐసీసీ, సీఏకు సవాల్‌గా మారింది.

ది ఫిబ్రవరి/మార్చి విండోకే మొగ్గు:

ది ఫిబ్రవరి/మార్చి విండోకే మొగ్గు:

కరోనా వైరస్‌ ముప్పు నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తోంది. సెప్టెంబర్‌ వరకు సరిహద్దులు మూసేసింది. ఆ తర్వాత ఎవరు వెళ్లినా 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో 16 జట్లు అక్కడికి వెళ్లి క్వారంటైన్‌ కావడం కష్టం. ప్రయాణ, వసతి ఖర్చులు ఎక్కువవుతాయి. ఇవన్నీ ఆలోచిస్తున్న సీఏ.. ఖాళీ స్టేడియాల్లో ప్రపంచకప్‌ నిర్వహణకు అనుకూలంగా లేదు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి/మార్చిలో ప్రపంచకప్‌ నిర్వహిస్తే బాగుంటుందన్నది సీఏ ఆలోచన.

ఐసీసీ ముందు మూడు ప్ర‌త్య‌మ్యాయాలు:

ఐసీసీ ముందు మూడు ప్ర‌త్య‌మ్యాయాలు:

టీ20 ప్రపంచకప్‌ టోర్నీని ఎప్పుడు నిర్వహించాలో అనేదానిపై ఐసీసీ మూడు ర‌కాల ప్ర‌త్య‌మ్యాయాలు చేస్తోంది. టోర్నీని వచ్చే ఫిబ్ర‌వ‌రి లో నిర్ణ‌యించాల‌ని ఐసీసీ భావిస్తోంది. ఇందుకు సీఏ కూడా సుముఖంగానే ఉంది. అయితే అదే స‌మ‌యంలో భార‌త్‌-ఇంగ్లాడ్ సిరీస్ ఉండ‌టంతో ప్ర‌సార‌దారుల నుంచి అభ్యంత‌రం వ్య‌క్త‌మ‌య్యే అవ‌కాశ‌ముంది. భారత్‌లో 2021 ప్రపంచకప్‌, ఆసీస్‌లో 2022 ప్రపంచకప్‌ ఆతిథ్యానికి పరస్పరం అంగీకరించుకోవడం మరో అవకాశం. ఇప్పటికే ఆసీస్‌ పర్యటనకు బీసీసీఐ సహకరిస్తున్న నేపథ్యంలో ఇదీ కుదరకపోవచ్చు. ఇక చివ‌ర‌గా 2022లో టోర్నీని నిర్వ‌హించ‌డం. ఆ ఏడాది ఒక్క ఐసీసీ టోర్నీ కూడా లేక‌పోవ‌డం కలిసొచ్చే అంశమే. మొత్తానికి వీటన్నిటిపై ఐసీసీ చర్చల్లో ఏం తేలుతుందన్నది ఆసక్తికరం.

అక్టోబర్‌-నవంబర్‌ విండోలో ఐపీఎల్:

అక్టోబర్‌-నవంబర్‌ విండోలో ఐపీఎల్:

ఆస్ట్రేలియా 2021 ఫిబ్రవరి/మార్చి విండోకే మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ప్రపంచకప్‌ వాయిదా పడితే మాత్రం అక్టోబర్‌-నవంబర్‌ విండోలో ఐపీఎల్‌-2020 నిర్వహణకు ఎలాంటి ఇబ్బందీ ఉండకపోవచ్చు. టోర్నీకి విదేశీ ఆటగాళ్లను తీసుకొచ్చేందుకు ఛార్టర్‌ విమానాలు నడిపేందుకు బీసీసీఐ వెనుకాడకపోవచ్చు. అప్పటికి వైరస్‌ పరిస్థితిపై సంపూర్ణ అవగాహన వస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌ను రద్దు చేయడం క్రికెట్‌కు నష్టమేనని ఐపీఎల్‌ మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ రామన్‌ నివేదిక పేర్కొంది. టీ20 ప్రపంచకప్‌ కంటే ఐపీఎల్‌ 70 శాతం ఎక్కువ రెవెన్యూ ఆర్జిస్తుందని రామన్‌ విశ్లేషించాడు.

Story first published: Friday, May 22, 2020, 16:40 [IST]
Other articles published on May 22, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+