Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోహిత్ వల్ల భారత్‌కే నష్టం.. ఆ స్టార్‌కు కెప్టెన్సీ ఇవ్వాలి- కేకేఆర్ మాజీ

ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం మహా సమరం మొదలుకానుంది. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా టీ20 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 2న మొదలుకానున్న ఈ మెగాటోర్నీ అదే నెల 29న ముగుస్తోంది. అయితే ఈ ప్రపంచకప్‌కు ఎంపికవ్వనున్న భారత జట్టుపై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లలో ఉత్కంఠ మొదలైంది.

తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్రపంచకప్ జట్టును కొందరు మాజీ క్రికెటర్లు ప్రకటిస్తున్నారు. వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి మాజీలు తమ ప్రిడిక్షన్ టీమ్‌ను వెల్లడించారు. అయితే కేకేఆర్ మాజీ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్జియా భారత జట్టు కూర్పు గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడమే జట్టుకు మంచిదని పేర్కొన్నాడు.

T20 World Cup I Would Choose Jasprit Bumrah Over Rohit Sharma as Captain- former KKR team director

ఫామ్‌లో లేని రోహిత్ జట్టు నుంచి తప్పుకుంటే ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు సువర్ణావకాశం మారుతుందని భట్టాచార్జియా అభిప్రాయపడ్డాడు. ''టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మను ఎంపిక చేసే నిర్ణయం జట్టుకే మంచిది కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ఫార్మాట్‌కు రోహిత్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు. హిట్‌మ్యాన్ అంటే నాకు చాలా గౌరవం ఉంది. అతను అద్భుతమైన క్రికెటర్''

''కానీ ప్రస్తుతం రోహిత్ శర్మ ఫామ్‌లో లేడు. మరోవైపు విరాట్ కోహ్లి, యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్ గొప్ప ఫామ్‌లో ఉన్నారు. వాళ్లు ప్రత్యర్థి జట్టులకు బలమైన పోటీదారులుగా ఉన్నారు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉంటే అతను తప్పక ఓపెనర్‌‌గా బరిలోకి దిగుతాడు. దీంతో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు బ్యాటింగ్ ఆర్డర్ దిగువన రావాల్సి వస్తుంది''

''రోహిత్ శర్మ స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి. ఎందుకంటే బుమ్రా జట్టులో కీలక సభ్యుడు. రోహిత్ తన క్రికెట్ కెరీర్‌లో దాదాపు అన్నీ సాధించాడు. కానీ అతనికి వరల్డ్ కప్ సాధించాలని ఉంది. అతను 2007 టీ20 ప్రపంచకప్‌ను గెలిచాడు. ఇప్పుడు కెరీర్‌ను ఘనంగా ముగించాలనుకుంటున్నాడు. దాన్ని మేం మంచి ముగింపు పిలుస్తుంటాం. అది మంచి ఆలోచనే'' అని భట్టాచార్జియా పేర్కొన్నాడు.

Story first published: Friday, April 26, 2024, 17:26 [IST]
Other articles published on Apr 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+