Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ SRH ప్లేయర్‌‌‌కే మొండిచేయి చూపిస్తారా? -షేన్ వాట్సన్

టీ20 ప్రపంచకప్‌కు ప్రకటించిన భారత జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సత్తాచాటుతున్న యువ ఆటగాళ్లకు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ భారత జట్టు ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

యార్కర్లు, వైవిధ్యమైన బంతులు సంధించే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్‌ను వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడంపై వాట్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఎడమచేతి వాటం బౌలర్ అయిన నటరాజన్ జట్టులో ఉంటే భారత్‌కు అదనపు బలంగా చేకూరుతుందని అభిప్రాయపడ్డాడు. రోహిత్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

T20 World Cup I was surprised that Natarajan wasn t in the India T20 squad- Shane Watson

పేస్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. హార్దిక్ పాండ్య అదనపు సీమర్‌గా భావించి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లనే సెలక్ట్ చేశారు. అయితే బుమ్రా మినహా మిగిలెనవరూ ఐపీఎల్‌లో సత్తాచాటలేకపోవడంతో సెలక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్‌లో సిరాజ్, అర్షదీప్, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో నటరాజన్, సందీప్ శర్మ వంటి బౌలర్లను సెలక్ట్ చేయాలని నెట్టింట డిమాండ్ వినిపిస్తోంది.

''యార్కర్లు సంధించే నైపుణ్యం, వైవిధ్యమైన వేగంతో బంతులు వేసే సామర్థ్యం నటరాజన్ సొంతం. అందుకే టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన భారత జట్టులో నటరాజన్ లేకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేగాక అతను నిలకడైన ప్రదర్శనతో రాణిస్తున్నాడు. కీలక సమయాల్లో కుదురుకున్న బ్యాటర్లకు కళ్లెం వేస్తున్నాడు. అతను సత్తాచాటితే భారత్‌లోని ప్రతి ఒక్కరూ, ప్రపంచ క్రికెట్ ఎంతో సంతోషిస్తుంటుంది'' అని వాట్సన్ అన్నాడు.

నటరాజన్ గురించి షేన్ వాట్సన్ చేసిన వ్యాఖ్యలపై సునీల్ గవాస్కర్ స్పందించాడు. జట్టులో నటరాజన్ ఉండాలని తాను కూడా భావించానని, అయితే టీమిండియాకు ఎంపికైన బౌలర్లకు ఎంతో అనుభవం ఉందని, వాళ్లు సత్తాచాటుతారని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ''ఎడమ చేతి వాటం పేసర్ నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. అతను జట్టులో ఉండాలని నేను భావించాను. కానీ ఫర్వాలేదు. ఎంపికైన భారత బౌలర్లకు ఎంతో అనుభవం ఉంది. కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు'' అని గవాస్కర్ చెప్పాడు.

టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌) సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుభ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేష్‌ ఖాన్.

Story first published: Sunday, May 5, 2024, 12:45 [IST]
Other articles published on May 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+