Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రిటైర్‌‌మెంట్ ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ హీరో!

క్రికెట్ ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ విషయం తెలిసింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఇంగ్లండ్ టీంలో కీలక సభ్యుడైన అలెక్స్ హేల్స్ తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు తెలిపాడు. అతను అర్ధంతరంగా ఈ ప్రకటన చేయడం క్రికెట్ ఫ్యాన్స్‌కు పెద్ద షాకే అని చెప్పాలి. ఎందుకంటే అతను మంచి ఫామ్‌లో ఉన్నాడు.

గతేడాది ఇంగ్లండ్ టీం పొట్టి ప్రపంచకప్ గెలవడంలో హేల్స్ పాత్ర చాలా ఉంది. జోస్ బట్లర్‌తో కలిసి ఆ టీంకు ఎన్నో అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ముఖ్యంగా సెమీ ఫైనల్‌లో భారత్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగాడీ ఇంగ్లిష్ స్టార్. ఆ టీంలో స్టార్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టోకు రిప్లేస్‌మెంట్‌గా వచ్చిన హేల్స్ టోరనీ ఆసాంతం చెలరేగాడు.

T20 World Cup

సరిగ్గా గతేడాది టీ20 వరల్డ్ కప్ సమయంలోనే జానీ బెయిర్‌స్టోకు గాయమైంది. దీంతో అతను ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఈ క్రమంలో అతని స్థానంలో హేల్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఈ టీం తరఫున 11 టెస్టులు, 70 వన్డేలు, 75 టీ20లు ఆడాడీ నాటింగ్‌హాంషైర్ బ్యాటర్.

ఇలా తను తీసుకున్న నిర్ణయం గురించి మాట్లాడిన హేల్స్.. 'మూడు ఫార్మాట్లలో కలిపి 156 మ్యాచుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించా. ఇది నిజంగా నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నా. దీని నుంచి మూవాన్ అవ్వాల్సిన సమయం వచ్చేసిందని అనుకుంటున్నా. నా జీవితాంతం గుర్తుండే కొన్ని జ్ఞాపకాలు, స్నేహాలు ఇక్కడ నాకు దొరికాయి' అని అన్నాడు.

'నేను ఇంగ్లండ్ జెర్సీలో ఆడిన సమయంలోనే కెరీర్‌లో అత్యంత పీక్స్ చూశా. అలాగే అత్యంత లో పాయింట్స్ కూడా చూశాను. నాకు ఇదొక అద్భుతమైన జర్నీ. నా కెరీర్‌లో ఇంగ్లండ్ తరఫున చివరి మ్యాచ్ వరల్డ్ కప్ గెలిచింది కావడం చాలా సంతోషకరమైన అంశం' అని చెప్పుకొచ్చాడు. టీ20ల్లో ఇంగ్లండ్ నుంచి వచ్చిన బెస్ట్ ప్లేయర్లలో హేల్స్ ఒకడనడంలో అతిశయోక్తి కాదు.

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనేక క్రికెట్ లీగుల్లో హేల్స్ అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. ఇప్పుడు అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు తెలిపినా కూడా ఇలాంటి లీగుల్లో మాత్రం ఆడుతూనే ఉంటానని చెప్పాడు. అలాగే నాటింగ్‌హాంషైర్ తరఫున కూడా ఆడుతూనే ఉంటానన్నాడు.

Story first published: Friday, August 4, 2023, 18:57 [IST]
Other articles published on Aug 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+