న్యూయార్క్ వేదికగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్ (42; 31 బంతుల్లో, 6 ఫోర్లు), అక్షర్ పటేల్ (20; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) మినహా మిగిలిన బ్యాటర్లు నిరాశపరిచారు. పాకిస్థాన్ బౌలర్లలో నసీమ్ షా (3/21), హారిస్ రవూఫ్ (3/21) చెరో మూడు వికెట్లు, మహ్మద్ అమీర్ (2/23) రెండు వికెట్లతో సత్తాచాటారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు పేలవారంభం దక్కింది. సీనియర్లు విరాట్ కోహ్లి (4; 3 బంతుల్లో, 1 ఫోర్), రోహిత్ శర్మ (13; 12 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఆదిలోనే పెవిలియన్‌కు చేరారు. ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్ (20; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) తో పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అక్షర్ ఔటైనా పంత్ రాణించడంతో భారత్ 10 ఓవర్లకు 81/3తో మెరుగైన స్థితిలో నిలిచింది.

కానీ ఆ తర్వాత తొమ్మిది ఓవర్లలో 38 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. పెవిలియన్‌కు క్యూ కట్టడానికి బ్యాటర్లు పోటీపడ్డారు. అయితే ఈ క్రమంలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్ చేతిలో తొలిసారి ఆలౌటైంది. పాకిస్థాన్‌పై భారత్ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఔటవ్వడం ఇదే మొదటిసారి. అంతేగాక టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు ఇది నాలుగో అత్యల్ప స్కోరు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్ అత్యల్ప స్కోరులు వరుసగా.. 79 వర్సెస్ న్యూజిలాండ్ (2016), 110/7 వర్సెస్ న్యూజిలాండ్ (2021), 118/8 వర్సెస్ దక్షిణాఫ్రికా (2009), 119 వర్సెస్ పాకిస్థాన్ (2024) వరుసగా ఉన్నాయి. అయితే భారత్ 119 పరుగులు అయినా సాధించిందంటే అది టెయిలెండర్ల కృషినే. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా అర్షదీప్ సింగ్ (9; 13 బంతుల్లో, 1 ఫోర్), సిరాజ్ (7 నాటౌట్; 7 బంతుల్లో) కీలక పరుగులు సాధించారు.