For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: దక్షిణాఫ్రికా కొంపముంచిన పంత్.. ఏం తెలివిరా బాబు!(Video)

భారత్ విశ్వవిజేతగా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరు ఆఖరి ఓవరకు ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు జట్లు నువ్వానేనా అన్నట్లుగా పోరాడాయి. ఇరు జట్ల మధ్య దోబూచులాడిన విజయం అంతిమంగా భారత్ దరికి చేరింది. ఫలితంతా టీమిండియా 13 ఏళ్ల ప్రపంచకప్ నిరీక్షణకు తెరపడింది.

అయితే భారత్ సాధించిన ఫైనల్‌ విజయంలో రిషభ్ పంత్ కీలకపాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో పంత్ రెండు బంతులే ఎదుర్కొని డకౌటయ్యాడు. ఇక వికెట్ కీపర్‌గానూ రెండు క్యాచ్‌లను అందుకున్నప్పటికీ అవేమి సంచలన క్యాచ్‌లేమి కావు. కానీ పంత్.. దక్షిణాఫ్రికాను మైండ్ గేమ్‌తో దెబ్బకొట్టాడు. మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతడి తెలివికి సఫారీ సేన కప్ ఆశలు ఆవిరయ్యాయి.

T20 World Cup Final Pant s Knee Niggle Slows Down South Africa s Momentum After 16th Over Proving to Be a Game-Changing Moment

అసలేం జరిగిదంటే.. దక్షిణాఫ్రికా విజయానికి 36 బంతుల్లో 54 పరుగులు అవసరం. ఈ సందర్భంలో 15వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్ హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ బాదడంతో ఆ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. దీంతో విజయ సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారింది. ఆ తర్వాత బుమ్రా వచ్చి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌతాఫ్రికా గెలుపుకు 24 బంతుల్లో 26 పరుగులు అవసరమయ్యాయి.

అయితే ఈ స్థితిలో పంత్ తెలివిగా వ్యవహరించాడు. బుమ్రా రాకతో నెమ్మదించిన క్లాసెన్ మూమెంట్‌ను మరింతగా స్లో‌డౌన్ చేయాలనుకున్నాడు. మోకాలి నొప్పి అంటూ ఆటను కాసేపు ఆపేశాడు. బ్యాండేజ్ వేసుకోవడంతో మ్యాచ్ ఆలస్యమైంది. మరోవైపు విరామం రావడంతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు లయ తప్పారు. బ్రేక్ అనంతరం హార్దిక్ వేసిన తొలి బంతికే క్లాసెన్ ఔటయ్యాడు.

కారు ప్రమాదానికి గురై, గొప్పగా కోలుకుని తిరిగొచ్చిన పంత్‌కు మోకాలి నొప్పి వచ్చిందంటే అది సహజంగానే అనిపిస్తుంది. కానీ పంత్ మ్యాచ్‌ను మలుపుతిప్పడానికే ఆటను నిలిపివేశాడని సగటు అభిమానికి ఆ క్షణంలో ఈజీగా అర్థమైంది. విరామం తీసుకోకపోతే క్లాసెన్, మిల్లర్ కొన్ని బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించేలా ఉన్నారు. అంతలా ఇద్దరూ కుదురుకున్నారు. కానీ పంత్ ఆ సమయంలో సమయస్ఫూర్తిగా వ్యవహరించిన తీరు భారత్‌కు కలిసొచ్చింది. మరోవైపు బ్రేక్ తర్వాత దక్షిణాఫ్రికాకు ఏదీ కలిసిరాలేదు.

కాగా, మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (76; 59 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) సత్తాచాటారు. మహరాజ్ (2/23), నోకియా (2/26) చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఎనిమిది వికెట్లకు 169 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (52; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) పోరాడాడు. హార్దిక్ (3/20) మూడు వికెట్లు, బుమ్రా (2/18), అర్షదీప్ సింగ్ (2/20) చెరో రెండు వికెట్లతో విజృంభించారు.

Story first published: Sunday, June 30, 2024, 10:09 [IST]
Other articles published on Jun 30, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+