For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్‌తో మ్యాచ్ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా.. ఆసీస్‌ పేసర్‌ సంచలన వ్యాఖ్యలు!!

T20 World Cup final: Australia pacer Megan Schutt says Just hate playing India

మెల్‌బోర్న్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. మార్చి 8వ తేదీన మెల్‌బోర్న్‌లో ఇరు జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడుతాయి. ఆసీస్‌ వరుసగా ఆరోసారి టీ20 ప్రపంచక్‌పలో ఫైనల్లో అడుగుపెట్టగా.. భారత్‌ తొలిసారి ఈ మెగా టోర్నీలో ఫైనల్‌కు చేరింది. టోర్నీ ఆరంభపు మ్యాచ్‌ భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య జరిగితే.. ముగింపు మ్యాచ్‌ కూడా ఈ రెండు జట్ల మద్యే జరగడం విశేషం. రెండు జట్లు పటిష్టంగా ఉండడంతో ఫైనల్ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

భారత్‌తో ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా

భారత్‌తో ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా

ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత్‌తో ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా అని పేర్కొన్నారు. భారత స్టార్ ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతీ మంధానాలే అందుకు కారణం అని కూడా ఆమె తెలిపారు. 'భారత మహిళల జట్టుతో ఫైనల్స్‌ ఆడటాన్ని అసహ్యించుకుంటున్నా. షెఫాలీ, మంధానాలకు బౌలింగ్ చేయాలంటే.. భయమేస్తోంది. వారి బ్యాటింగ్‌ నాకు వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా షఫాలీ ఎదురుదాడికి నా వద్ద సమాధానం లేదు' అని స్కట్‌ అన్నారు.

నేను చూసిన అత్యుత్తమ సిక్స్‌ అది:

నేను చూసిన అత్యుత్తమ సిక్స్‌ అది:

'షెఫాలీ, మంధానాలు భారత​ జట్టుకు వెన్నుముక. ఇన్నింగ్స్ ఆరంభం నుండే ఇద్దరూ బలమైన షాట్లతో దాడి చేస్తున్నారు. ఈ టోర్నీకి ముందు జరిగిన ముక్కోణపు సిరీస్‌లో షెఫాలీ కొట్టిన సిక్స్‌ నా కెరీర్‌లో నేను చూసిన అత్యుత్తమ సిక్స్‌. వారికి నేను బౌలింగ్‌ చేయడం అంత మంచి కాదేమో. ఆ జోడికి నా బౌలింగ్‌ కూడా సరైన మ్యాచింగ్‌ కూడా కాకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే పవర్‌ ప్లేలో వారికి నేను జోడిని కాను. వారి కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ఇద్దరిని ఆపడానికి ప్రయత్నిస్తా' అని మెగాన్‌ స్కట్‌ పేర్కొన్నారు.

షెఫాలీ ధాటికి బెంబేలెత్తిపోయింది:

షెఫాలీ ధాటికి బెంబేలెత్తిపోయింది:

గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌లో మెగాన్‌ స్కట్‌ రెండు వికెట్లుతీసి 17 పరుగులు మాత్రమే ఇచ్చింది. అయితే టోర్నీ ఆరంభపు మ్యాచ్‌లో ఆసీస్‌పై భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో స్కట్‌ వేసిన తన వ్యక్తిగత తొలి ఓవర్‌లో షెఫాలీ ధాటికి బెంబేలెత్తిపోయింది. ఆ ఓవర్‌లో షెఫాలీ నాలుగు ఫోర్లు కొట్టి మెగాన్‌కు చుక‍్కలు చూపించింది. ఇదే భయం ఇప్పుడు ఆమెను మరింత కలవర పెడుతున్నట్లు కనబడుతోంది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు:

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు:

భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో గురువారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా ఫైనల్‌కు చేరింది. ఇక రెండ‌వ సెమీస్‌లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో ఆస్ట్రేలియా 5 ప‌రుగుల తేడాతో విక్ట‌రీ సొంతం చేసుకుంది.

Story first published: Friday, March 6, 2020, 14:06 [IST]
Other articles published on Mar 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+