For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsPAK: పొట్టి ప్రపంచకప్ ముద్దాడేదెవరు?.. ఫైనల్ మ్యాచ్ పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్

T20 World Cup final at MCG pitch and weather report

కోట్లాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరింది. ఇంగ్లండ్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ జరిగే మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం పిచ్, వాతావరణం వివరాలు ఒకసారి గమనిస్తే..

ఫైనల్‌కు ఇంగ్లండ్ ప్రయాణం..

ఫైనల్‌కు ఇంగ్లండ్ ప్రయాణం..

గ్రూప్ దశలో మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్ జట్టు.. మెరుగైన రన్ రేట్ కారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి సెమీఫైనల్ చేరింది. ఐర్లాండ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన ఇంగ్లండ్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. చివరగా భారత్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 169 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు ఓపెనర్లు జోస్ బట్లర్, అలెక్స్ హేల్స్ ఇద్దరే ఛేదించారు. పూర్తి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయంతో ఘనంగా ఫైనల్ చేరింది ఇంగ్లండ్ జట్టు.

అనూహ్యంగా ఫైనల్ చేరిన పాక్

అనూహ్యంగా ఫైనల్ చేరిన పాక్

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ది చాలా వింత ప్రయాణం. భారత్, జింబాబ్వే చేతిలో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన ఆ జట్టు.. తర్వాతి మూడు మ్యాచుల్లో విజయాలు సాధించింది. అదే సమయంలో కాలం కూడా కలిసొచ్చి సౌతాఫ్రికా జట్టు అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడింది. దీంతో సెమీఫైనల్ చేరిన పాక్.. గ్రూప్-ఎ టేబుల్ టాపర్‌ న్యూజిల్యాండ్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన బౌలింగ్ దళం ఉన్న జట్లలో పాకిస్తాన్ కచ్చితంగా ఉంటుంది.

వాతావరణం ఎలా ఉందంటే?

వాతావరణం ఎలా ఉందంటే?

టీ20 ప్రపంచకప్ ఎవరిదో తేల్చే ఫైనల్ మ్యాచ్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరుగుతుంది. ఆదివారం నాడు మ్యాచ్ జరిగే సమయంలో ఇక్కడ 58 శాతం వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరీ భారీ వర్షం పడకున్నా.. జల్లులు అయినా మ్యాచ్‌కు అంతరాయం కలిగించ వచ్చని పేర్కొంది.

పిచ్ ఎవరికి అనుకూలం?

పిచ్ ఎవరికి అనుకూలం?

ఎంసీజీలో పిచ్ బ్యాలెన్స్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లకు అద్భుతంగా సహకారం లభిస్తుంది. దీంతో వాళ్లు చెలరేగిపోతారు. అయితే క్రీజులో బ్యాటర్లు కుదురుకుంటే వాళ్లు కూడా భారీ స్కోర్లు చేసే అవకాశం ఉంటుంది. ఈ మైదానంలో రికార్డులు పరిశీలిస్తే.. మ్యాచ్‌లో స్పిన్నర్ల ప్రభావం పెద్దగా ఉండబోదని తెలుస్తోంది. ఈ స్టేడియంలో సగటు జట్టు స్కోరు 160 పరుగులు ఉండగా.. ఇక్కడ జరిగిన 60 శాతం మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టే విజయం సాధించడం గమనార్హం.

Story first published: Sunday, November 13, 2022, 8:13 [IST]
Other articles published on Nov 13, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+