Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

England XI: మనుషులు కాదు మాన్‌స్టర్స్..డేంజర్‌గా ఇంగ్లండ్

జూన్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు ప్రధాన దేశాలన్నీ తమ జట్లను ప్రకటించాయి. అందరి కంటే ముందుగా న్యూజిలాండ్ తమ జట్టును వెల్లడించింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా వరుసగా తమ ఆటగాళ్లను పరిచయం చేశారు. అయితే డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ టీమ్ అందరి కంటే ప్రమాదకరంగా కనిపిస్తోంది.

ఇంగ్లండ్ జట్టులో దాదాపు ప్రతి ఆటగాడు సిక్సర్లను సునాయాసంగా సాధించగలడు. అంతేగాక బంతితో మాయ చేయగలడు. ఫీల్డింగ్‌లో అద్భుత విన్యాసాలు సృష్టించగలడు. దీంతో ప్రపంచకప్ ప్రారంభంకాక ముందే ఇంగ్లండ్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఎంపికైన 15 మందిలో తుది జట్టును అంచనా వేస్తే ఇంగ్లండ్ మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. ఇంగ్లిష్ జట్టును ఓడించడం ఏ జట్టుకు అంత సులువు కాదనే భావన కలుగుతోంది.

T20 World Cup England s Most Formidable Playing XI

ఓపెనర్లుగా వచ్చే కెప్టెన్ బట్లర్‌, ఫిల్ సాల్ట్ ఐపీఎల్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. పిచ్‌తో సంబంధం లేకుండా హిట్టింగ్ చేస్తున్నారు. వన్‌డౌన్‌లో రానున్న విల్ జాక్స్ ఇటీవల మెరుపు సెంచరీ సాధించాడు. గుజరాత్ టైటాన్స్‌పై ఆర్సీబీ తరఫున 31 బంతుల్లో అర్ధశతకం సాధించిన జాక్స్ మరో 10 బంతుల వ్యవధిలోనే శతకానికి చేరుకున్నాడు. మిడిల్ ఆర్డర్‌‌లో వచ్చే జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్ భీకర హిట్టర్లు. ఈ ఆటగాళ్లు కాసేపు క్రీజులో ఉన్నా ప్రత్యర్థికి తీవ్ర నష్టమే.

లోయర్ ఆర్డర్‌లో వచ్చే మొయిన్ అలీ, సామ్ కరన్, ఆర్చర్ కూడా హిట్టర్లే. అంతేగాక పదో స్థానంలో వచ్చే అదిల్ రషీద్ కూడా బ్యాటుతో సత్తాచాటగలడు. దీంతో ఇంగ్లండ్ ముందు ప్రత్యర్థి కొండంత లక్ష్యాన్ని ఉంచినా ధైర్యంగా ఉండలేని పరిస్థితి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇంగ్లండ్ తుది జట్టు (అంచనా)
బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, సామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, టోప్లే.

ఇంగ్లండ్ జట్టు: బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కరన్, బెన్ డకెట్, టామ్ హర్ట్‌లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.

Story first published: Wednesday, May 1, 2024, 12:11 [IST]
Other articles published on May 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+