Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: ఇంగ్లండ్ మాస్ వార్నింగ్.. వెస్టిండీస్‌పై ఘన విజయం

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ సూపర్-8లో అదిరేలా బోణీ కొట్టింది. సెయింట్ లూసియా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో తమ టీమ్ ఎంత ప్రమాదకరమో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.

జాన్సన్ చార్లెస్ (38; 34 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. పావెల్ (36; 17 బంతుల్లో, 5 సిక్సర్లు), రూథర్‌ఫర్డ్ (28 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్) దూకుడుగా ఆడారు. ఆదిల్ రషీద్, మొయిన్ అలీ, ఆర్చర్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ తీశారు. బ్రాండన్ కింగ్ (23 రిటైర్డ్ హట్, 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో వెస్టిండీస్‌కు శుభారంభం దక్కింది. పవర్‌ప్లేలో 54 పరుగులు సాధించింది. అదే జోరు కొనసాగించి.. 10 ఓవర్లకు 82/0 స్కోరుతో వెస్టిండీస్ మెరుగైన స్థితిలో నిలిచింది.

England won by eight wickets against West Indies

కానీ ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, వెస్టిండీస్ బ్యాటర్లు అతిగా డాట్ బాల్స్ ఆడటంతో స్కోరు వేగం తగ్గింది. వెస్టిండీస్ బ్యాటర్లు 51 బంతులన్ని డాట్‌బాల్స్‌గా ఆడారు. కాగా, అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 17.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (87 నాటౌట్; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 5 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్; 26 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.

ఛేదనలో ఆది నుంచే ఇంగ్లండ్ బ్యాటర్లు విజృంభించారు. సాల్ట్ మెరుపు దాడికి బట్లర్ (25; 22 బంతుల్లో, 2 ఫోర్లు) చక్కని సహకారం అందించడంతో ఇంగ్లిష్ జట్టు పవర్‌ప్లేలో 58/0తో నిలిచింది. అనంతరం బట్లర్, మొయిన్ అలీ (13; 10 బంతుల్లో, 2 ఫోర్లు) స్వల్ప వ్యవధిలోనే ఔటైనప్పటికీ బె‌యిర్‌స్టోతో కలిసి సాల్ట్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. షెఫార్డ్ వేసిన 16 ఓవర్‌లో సాల్ట్ విధ్వంసం సృష్టించాడు. మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 30 పరుగులు రాబట్టుకున్నాడు.ఈ క్రమంలో 38 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఘన విజయంతో గ్రూప్-2లో ఇంగ్లండ్ టేబుల్ టాపర్‌గా నిలిచింది.

Story first published: Thursday, June 20, 2024, 9:55 [IST]
Other articles published on Jun 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+