Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: పాపం వార్నర్.. బాధలో ప్రత్యర్థి జట్టు రూమ్‌కు వెళ్లి..! (Video)

తన కెరీర్‌లో చివరి టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఘోర తప్పిదం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'ప్రపంచవ్యాప్తంగా వార్నర్ ఎంతో క్రికెట్ ఆడాడు. ఆ కారణంతో అతన్ని క్షమించేద్దాం' అని క్యాప్షన్ రాసుకొచ్చింది. అసలేం జరిగిందంటే...

బార్బడోస్ వేదికగా గురువారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 164 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలు సాధించారు. మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.

T20 World Cup David Warner Nearly Enters Wrong Dressing Room After Oman Pacer s Send-Off

అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో ఒమన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అయాన్ ఖాన్ (36; 30 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. స్టొయినిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. స్టార్క్, ఎలిస్, జంపా తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఇన్నింగ్స్ ఆఖర్లో డేవిడ్ వార్నర్ భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. వార్నర్ వికెట్‌ను బౌలర్ కలీముల్లా దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు.

అయితే జట్టుకు భారీ స్కోరు అందించకుండా ఔటయ్యాననే బాధతో డేవిడ్ వార్నర్ మైదానం వీడాడు. మనసంతా తన వికెట్‌పైనే ఉంచి ముందుకు కదిలాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్‌కు బదులుగా మరిచిపోయి ప్రత్యర్థి జట్టు డ్రెస్సింగ్ రూమ్‌ దిశగా వెళ్లాడు. మెట్లెక్కి దగ్గర వరకు వెళ్లాడు. ఇంతలో తేరుకొని, పొరపాటును గ్రహించి తిరిగి ఆసీస్ రూమ్‌కు వెళ్లాడు. దీన్ని చూసిన వ్యాఖ్యాతలు విరగబడి నవ్వారు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఫన్నీగా షేర్ చేసింది. కాగా, డేవిడ్ వార్నర్ ఈ వీడియోకు 'దిజ్ ఈజ్ ఫన్నీ' అంటూ కామెంట్ చేశాడు.

Story first published: Thursday, June 6, 2024, 19:31 [IST]
Other articles published on Jun 6, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+