For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Dale Steyn: అతను గేమ్ ఛేంజర్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో కచ్చితంగా ఉండాలి! కోహ్లీకి స్టెయిన్ సలహా!!

T20 World Cup: Dale Steyn says Hardik Pandya is a game-changer, must included in India playing XI
T20 World Cup : Ind vs Pak మ్యాచ్ లో అతను కచ్చితంగా ఉండాలి! - Dale Steyn || Oneindia Telugu

దుబాయ్: యూఏఈ, ఒమన్‌ వేదికగా టీ20 ప్రపంచకప్‌ 2021 మొదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచులు జరుగుతున్నాయి. అక్టోబ‌ర్ 23న సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా అబుదాబిలో జ‌ర‌గ‌బోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు త‌ల‌ప‌డ‌తాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబ‌ర్ 24న భారత్, పాకిస్థాన్ మ‌ధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.మరో మూడు రోజుల్లో మెగా టోర్నీ ఆరంభం కానున్న నేపథ్యంలో మాజీలు అందరూ తమతమ అభిప్రాయాలు చెపుతున్నారు. కొందరు పలు జట్లకు సూచనలు కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ సలహా ఇచ్చాడు.

ఫామ్‌ లేమితో హార్దిక్:

ఫామ్‌ లేమితో హార్దిక్:

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా గత కొంత కాలంగా ఫామ్‌ లేమితో సతమతమవుతున్న విషయం తెలిసిందే. సరిగ్గా చెప్పాలంటే 2019 నుంచి అతడు తనదైన శైలిలో ఆడడం లేదు. వెన్నముఖ శస్త్రచికిస్త కారణంగా చాలా రోజులు జట్టుకు దూరమైన హార్దిక్.. అడపాదడపా జట్టులోకి వస్తూపోతూ ఉన్నాడు. బ్యాటింగ్‌ చేస్తున్నా బౌలింగ్ మాత్రం చేయడంలేదు. శ్రీలంక సిరీస్, ఐపీఎల్ 2021లో కూడా బౌలింగ్ చేయలేదు. దాంతో టీ20 ప్రపంచకప్‌ 2021కి అతడిని ఎంపిక చేయడంతో కొందరు మండిపడ్డారు. ఇక తుది జట్టులో ఆడించొద్దని మరికొందరు అన్నారు. అయితే హార్దిక్ ఓ గేమ్ ఛేంజర్ అని, భారత తుది జట్టులో అతడు కచ్చితంగా ఉండాలని డేల్ స్టెయిన్ సూచించాడు.

పాండ్యా ఓ గేమ్ ఛేంజర్:

పాండ్యా ఓ గేమ్ ఛేంజర్:

స్టార్ స్పోర్ట్స్ షోలో డేల్ స్టెయిన్ మాట్లాడుతూ... 'హార్దిక్ పాండ్యా ఓ గేమ్ ఛేంజర్. టీమిండియాకు అతడు అతిపెద్ద బలం. హార్దిక్ బ్యాట్ లేదా బంతితో అద్భుతంగా రాణించగలడు. ముఖ్యంగా బ్యాట్‌తో అద్బుతాలు చేస్తాడు. నిజమే హార్దిక్ ఇటీవల ఎక్కువగా బౌలింగ్ చేయలేదు. నిజాయితీగా చెప్పాలంటే నేను అతడిని పూర్తిగా బ్యాటింగ్‌ కోసం మాత్రమే ఎంచుకుంటాను. ప్రస్తుత ఫామ్ ప్రకారంగా అతడు కాస్త వెనకబడే ఉన్నాడు కానీ హార్దిక్ అద్భుత ఆటగాడు. అన్ని జట్లకు ఈ విషయం తెలుసు. హార్దిక్ బ్యాటింగ్ కోసం మైదానంలోకి వస్తే.. ప్రత్యర్ధులు వ్యూహాలు రచిస్తారు. ఎందుకంటే.. అతడు ఒక ఓవర్లోనే మ్యాచును మలుపుతిప్పగలడు' అని అన్నాడు.

 పాకిస్థాన్‌తో జరిగే మ్యాచుకు భారత తుది జట్టు ఇదే:

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచుకు భారత తుది జట్టు ఇదే:

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచుకు భారత తుది జట్టును సెలక్ట్ చేయాలని భారత మాజీ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను డేల్ స్టెయిన్ కోరాడు. రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చహార్, వరుణ్ చక్రవర్తిలను పాకిస్తాన్‌పై భారత ఎలెవన్ కోసం లక్ష్మణ్ ఎంచుకున్నాడు. అయితే భువనేశ్వర్ స్థానంలో మొహ్మద్ షమీని స్టెయిన్ ఎంచుకున్నాడు. షమీ చక్కగా బౌలింగ్ చేస్తాడన్నాడు. భువీ కూడా అద్భుతంగా బౌల్ చేస్తాడు కానీ తాను షమీనే ఎంచుకుంటానని స్టెయిన్ చెప్పాడు.

పాండ్యా బౌలింగ్ చేస్తాడు:

పాండ్యా బౌలింగ్ చేస్తాడు:

28 ఏళ్ల హార్దిక్ పాండ్యా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేదు. అతడు ప్రస్తుతం స్వచ్ఛమైన బ్యాటర్‌గా జట్టులో ఉన్నట్లు కనిపిస్తోంది. టీమిండియా తమ మొదటి మ్యాచ్ ఆడడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. టీ 20 ప్రపంచకప్‌లో పాండ్యా బౌలింగ్ చేస్తాడని రోహిత్ శర్మ ఈరోజు చెప్పాడు. 'ఆరో బౌలింగ్ ఆప్షన్‌తో పాటు బ్యాటింగ్ కాంబినేషన్‌ను కూడా ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌తో సెట్ చేయాలనుకుంటున్నాము. ఈరోజు మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. ప్రస్తుతానికి హార్దిక్ బౌలింగ్ చేయడం లేదు. బౌలింగ్ చేయడానికి కొంత సమయం పడుతుంది. టోర్నమెంట్ ప్రారంభానికి అతను సిద్ధంగా ఉండాలి' అని ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా అన్నాడు.

Story first published: Wednesday, October 20, 2021, 17:19 [IST]
Other articles published on Oct 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+