For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: అతని వల్లే ఓడిపోయాం- బట్లర్

సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం దక్షిణాఫ్రికాతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఏడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఓ దశలో ఓటమిదిశగా, అనంతరం విజయానికి చేరువగా దూసుకెళ్లిన ఇంగ్లండ్ అంతిమంగా పరాజయాన్ని చవిచూసింది. సూపర్-8 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఇదే తొలి ఓటమి. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 163 పరుగులు చేసింది.

క్వింటన్ డికాక్ (65; 38 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (43; 28 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అదరగొట్టారు. జోఫ్రా ఆర్చర్ (3/40) మూడు వికెట్లు తీశాడు. 9.4 ఓవర్లలో 86/0తో మెరుగైన స్థితిలో ఉన్న సౌతాఫ్రికా సునాయాసంగా 200 మార్క్‌ను అందుకునేలా కనిపించింది. కానీ ఇంగ్లండ్ బౌలర్లు పుంజుకుని స్కోరును కట్టడిచేశారు. అనంతరం ఛేదనలో ఇంగ్లిష్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితమైంది.

T20 World Cup Buttler Reflects on Defeat Quinton de Kock s Brilliant Innings Made the Difference

హ్యారీ బ్రూక్ (53; 37 బంతుల్లో, 7 ఫోర్లు), లివింగ్‌స్టోన్ (33; 17 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడారు. కేశవ్ మహరాజ్ (2/25), రబాడ (2/32) చెలరేగడంతో ఇంగ్లండ్ 61 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ బ్రూక్-లివింగ్‌స్టోన్ అయిదో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇంగ్లండ్‌ను తిరిగి పోటీలోకి తెచ్చారు. కానీ ఆఖర్లో ఔటై జట్టును విజయతీరాలకే చేర్చలేకపోయారు.

కాగా, మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఓటమి గల కారాణాలు వివరించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ తమ ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించని పిచ్‌పై డికాక్ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ తీవ్ర ప్రభావం చూపించిందని అన్నాడు. ''పవర్‌ప్లే‌... డికాక్ ఎంతో తీవ్రతతో బ్యాటింగ్‌కు వచ్చాడు. అతడి ఇన్నింగ్స్ వేగాన్ని మేం అందుకోలేకపోయాం. అయితే ఆ తర్వాత పరిస్థితులను చక్కదిద్దాం. స్కోరు వేగాన్ని తగ్గించాం. కానీ అతడి ఇన్నింగ్స్ ఇరు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసం''

''ఇక ఛేదనలో హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. విజయానికి దగ్గరగా తీసుకువచ్చారు. కానీ క్రెడిట్ దక్షిణాఫ్రికాకు ఇవ్వాలి. వాళ్లు మ్యాచ్‌ను తిరిగి లాగేసుకున్నారు. సెమీస్ రేసులో మేం ఇంకా పోటీలోనే ఉన్నాం. ఇవాళ గొప్పగానే ఆడాం. కానీ అంతిమంగా విజయతీరాలకు చేరలేకపోయాం'' అని బట్లర్ పేర్కొన్నాడు.

Story first published: Saturday, June 22, 2024, 8:47 [IST]
Other articles published on Jun 22, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+