Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంధుల టీ20 వరల్డ్ కప్: భారత్ ఘన విజయం

హైదరాబాద్: అంధుల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా మరో విజయాన్ని సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌‌గా బరిలోకి దిగిన టీమిండియా గురువారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 19.4 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటైంది.

ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఎడ్వర్డ్ 34 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులతో రాణించగా, జస్టిన్ (24), ల్యూక్ జాసన్ (16) పరుగులతో ఫరవాలేదనిపించారు. భారత బౌలర్లు వరస విరామాల్లో వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెంచారు. భారత బౌలర్లలో కేతన్ పటేల్ 2 వికెట్లు తీశాడు.

T20 World Cup for Blind: India thrash England by 10 wickets

అనంతరం 159 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 11 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు సుక్‌రామ్ 32 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఓపెనర్ గణేశ్ 34 బంతుల్లో 15 ఫోర్లతో 78 నాటౌట్ చెలరేగారు.

మరో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించగా, ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై, నేపాల్ 3 పరుగులతో దక్షిణాఫ్రికాపై, బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించాయి.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+