నోట్ల రద్దు ఎఫెక్ట్: బెంగుళూరులో టీ20 వరల్ట్ కప్ ఫైనల్
హైదరాబాద్: అంధుల టీ20 వరల్డ్ కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌కు బెంగుళూరులోని చిన్నసామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. జనవరి 30 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీలో ఆతిథ్య భారత్‌తో సహా పాకిస్థాన్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, నేపాల్ జట్లు పాల్గొంటున్నాయి.
అయితే నోట్ల రద్దు, బీసీసీఐలో అధ్యక్ష, కార్యదర్శులపై సుప్రీం కోర్టు వేటు టోర్నీ నిర్వాహణ ఏర్పాట్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత అంధుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు జీకే మహంతేష్ పేర్కొన్నారు. ముఖ్యంగా టోర్నీ నిర్వాహణకు కావాల్సిన నిధుల సమీకరణ కష్టంగా మారిందన్నారు.

ముందుకొచ్చిన కార్పోరేట్ కంపెనీలు
ఈ టోర్నీ నిర్వహణ కోసం తొలుత కొన్ని కార్పోరేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ నోట్ల రద్దు కారణంగా కోకకోలా కంపెనీ తమ స్పాన్సర్‌షిప్‌ని రద్దుచేసింది. దీంతో వరల్డ్‌కప్ నిర్వహణకు కావల్సిన రూ. 12 కోట్ల నిధుల సేకరణ కష్టంగా మారిందని ఆయన చెప్పారు.

2 కోట్లు ఇస్తామన్న బీసీసీఐ
మరోవైపు ఈ టోర్నీ కోసం బీసీసీఐ రూ. 2 కోట్లు ఇస్తామని ముందుకొచ్చింది. అయితే ఇటీవల సుప్రీం కోర్టు బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులను తప్పించడంతో ఆ సంస్థ నుంచి రావాల్సిన సహాయంపై సందిగ్ధత ఏర్పడింది. దీంతో బడ్జెట్‌ను సగానికి సగానికి తగ్గించుకున్నామని అన్నారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా రాహుల్ ద్రవిడ్
హైదరాబాద్ వేదికగా జరిగే మ్యాచ్‌ల నిర్వహణ ఖర్చును మాత్రం తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు భరించేందుకు ముందుకు వచ్చాయి అని మహంతేశ్ తెలిపారు. జనవరి 30 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీకి టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఫిబ్రవరి 12వ తేదీన ఫైనల్
అంధుల టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు లీగ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అనంతరం ఫిబ్రవరి 11వ తేదీన సెమీ ఫైనల్ జరుగుతుండగా, ఫైనల్ మ్యాచ్ 12వ తేదీన బెంగుళూరులో జరగనుంది. అంధుల టీ20 వరల్డ్ కప్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి దీనిని విజయవంతం చేయాలని కోరుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications