Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: హెల్మె‌ట్‌లో దూరిన బంతి..ముట్టుకుంటే ఔట్ అని ఏం చేశాడంటే! (Video)

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8 రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. కింగ్స్‌టౌన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 159 పరుగులు చేసింది. షకిబ్ అల్ హసన్ (64 నాటౌట్, 46 బంతుల్లో, 9 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో సత్తాచాటాడు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్, వాన్ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనలో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 134 పరుగులే చేసింది. సిబ్రాండ్ (33; 22 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషద్ హొస్సేన్ మూడు, తస్కిన్ రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో బంగ్లాదేశ్ నాలుగు పాయింట్లకు చేరుకుంది. +0.478 నెట్‌రన్‌రేటుతో రెండో స్థానంలో నిలిచింది. సూపర్-8కు అధికారికంగా అర్హత సాధించనప్పటికీ అవకాశాలను మెరుగుపర్చుకుంది.

T20 World Cup Ball Stuck in Tanzid Hasan s Helmet Video Goes Viral

గ్రూప్-డీ నుంచి దక్షిణాఫ్రికా ఇప్పటికే తదుపరి దశకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన స్థానం కోసం బంగ్లాదేశ్‌తో పాటు నెదర్లాండ్స్, నేపాల్ కూడా పోటీలోనే ఉన్నాయి. శ్రీలంక టోర్నీ నుంచి ఔటైన విషయం తెలిసిందే. ఆదివారం నేపాల్‌తో జరిగే పోరులో బంగ్లాదేశ్ విజయం సాధిస్తే తదుపరి దశకు అర్హత సాధిస్తుంది. ఒక వేళ ఓటమిపాలైతే నెదర్లాండ్, నేపాల్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

కాగా, బంగ్లాదేశ్-నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో హాస్యాస్పదమైన సంఘటన చోటు చేసుకుంది. నెదర్లాండ్స్ బౌలర్ వివియన్ వేసిన బౌన్సర్ తన్జీద్ హసన్‌ హెల్మెట్‌కు బలంగా తాకింది. అదృష్టవశాత్తు అతనికి ఏ గాయం అవ్వలేదు. కానీ బంతి మాత్రం తన్జీద్ హెల్మెట్‌లో ఇరుక్కుంది. చేతితో బంతిని తీద్దామనుకుంటే ప్రత్యర్థి జట్టు ఎక్కడ ఔట్ అని అపీల్ చేస్తుందో అని భయపడి తన్జీద్ హెల్మెట్‌ను తీసి నేలకు కొట్టాడు. అయినప్పటికీ బంతి బయటకు రాలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Story first published: Friday, June 14, 2024, 18:52 [IST]
Other articles published on Jun 14, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+