For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: ఆసీస్ కొంపముంచిన అఫ్గాన్ యాక్టింగ్..ఆటతో పాటు నటన!(Video)

టీ20 వరల్డ్ కప్‌లో సెమీస్ రేసు ముగిసింది. గ్రూప్-1 నుంచి భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌పై డక్‌వర్త్‌లూయిస్ పద్ధతిలో ఎనిమిది పరుగుల తేడాతో గెలిచి ఈ ఘనత అందుకుంది. వరల్డ్ కప్‌ చరిత్రలో అఫ్గానిస్థాన్ సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. అయితే అఫ్గానిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య పోరు హోరాహోరీగా సాగడంతో ఓ దశలో ఆస్ట్రేలియా సెమీస్‌కు క్వాలిఫై అయ్యేలా పరిస్థితి నెలకొంది.

బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓటమిపాలైతే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఓ దశలో బంగ్లాదేశ్ విజయం దిశగా నెమ్మదిగా సాగుతోంది. దీంతో అఫ్గానిస్థాన్ ఆటకు కావాలనే ఆటంకం కలిగించింది. ఆటను ఆలస్యంగా ప్రారంభించాలని, వరుణుడు ప్రతాపంతో మ్యాచ్ రద్దు కావాలని ట్రై చేసింది. ఎందుకంటే ఆ సమయంలో డక్‌వర్త్‌లూయిస్ పద్ధతితో బంగ్లాదేశ్ రెండు పరుగుల వెనుకంజలో ఉంది.

T20 World Cup Afghanistan s Performance and Drama Knock Australia Out of Tournament Reaching Semi-Finals

11.4 ఓవర్లకు బంగ్లాదేశ్ స్కోరు 81/7. బంగ్లా విజయానికి 48 బంతుల్లో 33 పరుగులు అవసరం. అయితే ఆ సమయంలో తేలికపాటి జల్లులు ప్రారంభమయ్యాయి. అప్పటికే వరుణుడు చాలా సార్లు ఆటకు ఆటంకం కలిగించాడు. మరోసారి మ్యాచ్‌ను ఆపేస్తే కచ్చితంగా ఓవర్లను తగ్గించి మ్యాచ్‌ను కుదిస్తారు. ఇది అఫ్గానిస్థాన్‌కు లాభంగా మారుతుంది. దీంతో అఫ్గానిస్థాన్ కోచ్ జొనాతన్ ట్రోట్ మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సిగ్నల్ పంపాడు. మ్యాచ్‌ను స్లో చేయమని సూచించాడు.

దీంతో స్లిప్‌లో ఉన్న గుల్బాదిన్ నైబ్ తొడకండరాల పట్టేశాయని మైదానంలో పడిపోయాడు. కావాలనే చేస్తున్నాడని అంపైర్లుకు తెలిసినా ఏం చేయలేకపోయారు. మరోవైపు వరుణుడు కాస్త పుంజుకున్నాడు. దీంతో అంపైర్లు కవర్లను తెప్పించారు. పది నిమిషాలకే మ్యాచ్ తిరిగి ఫ్రారంభమైనప్పటికీ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బంగ్లా లక్ష్యాన్ని 48 బంతుల్లో 33 పరుగుల నుంచి 42 బంతుల్లో 32 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు. అంటే ఓ ఓవర్‌‌ను తగ్గించి బంగ్లా టార్గెట్‌ను ఒక్క పరుగు తగ్గించారు. ఇది అఫ్గానిస్థాన్‌కు అదృష్టంగా మారింది.

మరోవైపు ఇది బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఫలితంగా మ్యాచ్‌ను కోల్పోయింది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదట అఫ్గానిస్థాన్ 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 115 పరుగులు చేసింది. గుర్బాజ్ (43; 55 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. రిషద్ హొస్సేన్ (3/26) మూడు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. రషీద్ ఖాన్ (4/23), నవీనుల్ హక్ (4/26) చెరో నాలుగు వికెట్లతో విజృంభించారు. లిటన్ దాస్ (54 నాటౌట్; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడాడు.

Story first published: Tuesday, June 25, 2024, 11:28 [IST]
Other articles published on Jun 25, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+