Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SA vs AFG: అఫ్గానిస్థాన్ ఆశలు ఆవిరి!

ట్రిండాడ్ వేదికగా సౌతాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌ ఏకపక్షంగా సాగుతోంది. మందకొడి పిచ్‌పై అఫ్గానిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు దాటికి వణికిపోయారు. 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటయ్యారు. పిచ్ బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్నప్పటికీ అఫ్గానిస్థాన్ పోరాడే స్కోరు కూడా సాధించలేకపోయింది. అఫ్గానిస్థాన్ ఫైనల్ ఆశలు దాదాపు ఇక ఆవిరైనట్లే!

అఫ్గానిస్థాన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ (10; 12 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నాడు. మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరారు. ముగ్గురు బ్యాటర్లు డకౌటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు.

T20 World Cup Afghanistan s Batsmen Falter in Semi-Final Clash Against South Africa

అఫ్గానిస్థాన్‌ను జేన్సన్, రబాడ ఆదిలోనే దెబ్బకొట్టారు. ఆ జట్టు బ్యాటింగ్ మూలస్తంభాలైన రహ్మనుల్లా గుర్బాజ్(డకౌట్; 3 బంతుల్లో)ను జేన్సన్, ఇబ్రహీం జద్రాన్ (2; 5 బంతుల్లో)ను రబాడ బోల్తాకొట్టించారు. ఆ తర్వాత అఫ్గాన్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరడానికి పోటీపడ్డారు. అఫ్గానిస్థాన్ 28 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్ (8; 8 బంతుల్లో, 2 ఫోర్లు)..కరీమ్ జనత్ (8; 13 బంతుల్లో, 1 ఫోర్)‌తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. వీరిద్దరు ఏడో వికెట్‌కు 22 పరుగులు జోడించారు. కానీ బంతిని అందుకున్న స్పిన్నర్ షంసీ అఫ్గాన్ బ్యాటర్లను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఔట్ చేశాడు. అఫ్గాన్ బ్యాటర్లు నాటౌట్ కోసం రివ్యూకి వెళ్లిన అంపైర్ కాల్‌తో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు.

అఫ్గాన్ బ్యాటర్లు గుర్బాజ్ (డకౌట్), జద్రాన్ (2), గుల్బాదిన్ నైబ్ (9), ఒమర్జాయ్ (10), మహ్మద్ నబీ (డకౌట్), ఖరోటే (2), కరీమ్ జనత్ (8), రషీద్ ఖాన్ (8), నూర్ అహ్మద్ (డకౌట్), నవీనుల్ హక్ (2), ఫజల్లా ఫరూకీ (2 నాటౌట్) పరుగులు చేశారు.

Story first published: Thursday, June 27, 2024, 7:23 [IST]
Other articles published on Jun 27, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+