Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీ20 ప్రపంచ కప్‌పై ఆస్ట్రేలియా కీలక ప్రకటన.. ఓపెనర్‌గా స్టార్ ప్లేయర్!

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభం కావడానికి సుమారు ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ఆస్ట్రేలియా జట్టు ఇప్పటి నుంచే తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ మిచెల్ మార్ష్ ఒక కీలకమైన ప్రకటన చేశారు. రాబోయే టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా తరఫున ఓపెనర్‌గా ఎవరు బరిలోకి దిగుతారనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

ఓపెనర్‌గా ట్రావిస్ హెడ్ ఖరారు
టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత డేవిడ్ వార్నర్ రిటైర్ కావడంతో అతని స్థానంలో ఓపెనింగ్ బ్యాటర్‌గా ఎవరు వస్తారని విషయంపై చాలా చర్చ జరిగింది. డేవిడ్ వార్నర్ స్థానంలో మాథ్యూ షార్ట్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జేక్ ఫ్రేజర్ వంటి ఆటగాళ్లను ప్రయత్నించినా, ఎవరూ కూడా డేవిడ్ వార్నర్ స్థాయిలో ప్రభావం చూపలేకపోయారు. ఈ నేపథ్యంలో మిచెల్ మార్ష్ మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ప్రపంచ కప్‌లో ట్రావిస్ హెడ్ మా జట్టుకు ఓపెనర్‌గా ఉంటాడని స్పష్టం చేశారు. "మేమిద్దరం కలిసి చాలా మ్యాచ్‌లు ఆడాం, మా మధ్య మంచి అవగాహన ఉంది. కాబట్టి, మా ఓపెనింగ్ కాంబినేషన్ అతనితోనే మొదలవుతుంది" అని ఆయన తెలిపారు.

T20 World Cup 2026 Travis Head Confirmed as Australia s Opener

టిమ్ డేవిడ్‌పై ప్రశంసలు
మిచెల్ మార్ష్ ఇటీవల వెస్టిండీస్ జట్టుపై కేవ‌లం 37 బంతుల్లోనే సెంచరీ సాధించిన టిమ్ డేవిడ్ గురించి కూడా మాట్లాడారు. "టిమ్ డేవిడ్ బ్యాటింగ్ గురించి మేము చర్చించుకున్నాం. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లలో అతను రెగ్యులర్‌గా ముందే బ్యాటింగ్‌కు వచ్చాడు. మిచెల్ మార్ష్ ఎంత ఎక్కువ బంతులు ఎదుర్కొంటే, అంత ఎక్కువ మ్యాచ్‌లలో మనల్ని గెలిపిస్తాడని ఆశిస్తున్నాను" అని మిచెల్ మార్ష్ పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాతో రాబోయే టీ20 సిరీస్
ఆస్ట్రేలియా జట్టు ఆగస్టు 10 నుండి దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశం లభించింది.

టీ20 సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు:
మిచెల్ మార్ష్(కెప్టెన్), సీన్ అబాట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షియస్, నాథన్ ఎల్లిస్, కామెరూన్ గ్రీన్, జోష్ హాజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నేమాన్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, ఆడమ్ జంపా.

Story first published: Saturday, August 9, 2025, 15:44 [IST]
Other articles published on Aug 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+