Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2026: భారత తుది జట్టు ప్రకటన అప్పుడే!

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ఇంకా సుమారు ఒకటిన్నర నెల సమయం మాత్రమే ఉంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికగా ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ కోసం టీమిండియా 15 మంది సభ్యుల తుది జట్టు ఎలా ఉండబోతోంది? బీసీసీఐ ఎప్పుడు జట్టును అధికారికంగా ప్రకటిస్తుందనే అంశంపై తాజాగా ఓ కీలక అప్‌డేట్ వచ్చింది.

జట్టు ప్రకటన జనవరి మొదటి వారంలో!
భారత జట్టు ప్రకటన కోసం అభిమానులు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి బీసీసీఐ వర్గాలు ఓ కీలక సమాచారాన్ని వెల్లడించాయి. న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపిక చేసే స్క్వాడ్ దాదాపుగా ప్రపంచ కప్‌లో కూడా కొనసాగే అవకాశం ఉంది. న్యూజిలాండ్ సిరీస్, ప్రపంచ కప్ కోసం టీమిండియా 15 మంది సభ్యుల స్క్వాడ్‌ను జనవరి 2026 మొదటి వారంలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు న్యూజిలాండ్ సిరీస్‌ను ప్రపంచ కప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నారు.

T20 World Cup 2026 Team India Final Squad Announcement Date Revealed

ప్రపంచ కప్‌కు ముందు భారత్ షెడ్యూల్
ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా మొత్తం 7 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. దక్షిణాఫ్రికాతో 2 మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌లు ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా టీ20 ఫార్మాట్‌లో అత్యంత బలమైన జట్టుగా ఉంది. దీంతో 15 మంది తుది జట్టులో చోటు దక్కించుకోవడం చాలా మంది పెద్ద ఆటగాళ్లకు కూడా కష్టంగా మారింది.

టీమిండియా ప్రపంచ కప్ షెడ్యూల్
ప్రపంచ కప్‌లో టీమిండియా ఆడబోయే లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇది.
*ఫిబ్రవరి 7, 2026- భారత్ vs అమెరికా(ముంబై వేదిక)
*ఫిబ్రవరి 12, 2026-భారత్ vs నమీబియా(ఢిల్లీ)
*ఫిబ్రవరి 15, 2026 -భారత్ vs పాకిస్థాన్(కొలంబో)
*ఫిబ్రవరి 18, 2026-భారత్ vs నెదర్లాండ్స్(అహ్మదాబాద్)

ఫైనల్ ఎక్కడ?
టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. అయితే ఒకవేళ ఫైనల్‌కు పాకిస్తాన్ అర్హత సాధిస్తే, ఫైనల్ వేదికను కొలంబోలోని ప్రేమదాస స్టేడియానికి మార్చడం జరుగుతుంది.

Story first published: Tuesday, December 16, 2025, 11:36 [IST]
Other articles published on Dec 16, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+