T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ హై-వోల్టేజ్ పోరుపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి ఐసీసీ తప్పించడాన్ని నిరసిస్తూ.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. అయిత ఐసీసీ హెచ్చరికల నేపథ్యంలో పీసీబీ తన పట్టు సడలిస్తూ కొన్ని కీలక డిమాండ్లను చర్చల సందర్భంగా తెరపైకి తెచ్చింది.
డెడ్‌లాక్‌ను వీడాలంటే ఆ 3 డిమాండ్లు తీరాల్సిందే!
లాహోర్‌లో ఐసీసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. టోర్నీ నుంచి బంగ్లాదేశ్‌ను తొలగించినందున ఆ బోర్డుకు జరిగిన నష్టానికి ఐసీసీ భారీ పరిహారం చెల్లించాలని పాక్ డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీలో ఆడకపోయినా వారికి అందాల్సిన 'పార్టిసిపేషన్ ఫీజు'ను కూడా ఐసీసీ అందజేయాలని కోరుతోంది.

ప్రస్తుతం ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు అందుతున్న వార్షిక నిధులు సరిపోవని, భారత్-పాక్ మ్యాచ్ వల్ల వచ్చే ఆదాయంలో తమకూ అధిక వాటా ఉండాలని పీసీబీ వాదిస్తోంది. తమ బోర్డుకు అందే నిధులను పెంచితేనే భారత్‌తో ఆడేందుకు మొగ్గు చూపుతామని సంకేతాలిచ్చింది. మున్ముందు జరగబోయే ఐసీసీ మెగా ఈవెంట్లలో (ఉదాహరణకు అండర్-19 వరల్డ్ కప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ) కనీసం ఒక టోర్నీ నిర్వహణ హక్కులను తమకు కేటాయించాలని పీసీబీ గట్టిగా కోరుతోంది.
ఐసీసీ సీరియస్ హెచ్చరికలు
పాకిస్థాన్ డిమాండ్ల వెనుక ప్రధాన కారణం ఐసీసీ ఇచ్చిన 'వార్నింగ్' అని విశ్లేషకులు చెబుతున్నారు. కేవలం భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తామన్న పాక్ వాదనను ఐసీసీ తోసిపుచ్చింది. ఒకవేళ పాక్ తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే.. సభ్యత్వ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు కోట్లాది రూపాయల జరిమానా ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత్‌కు ఉచితంగా పాయింట్లు లభించడమే కాకుండా, పాక్ రన్ రేట్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. నిబంధనలను అతిక్రమిస్తే పాక్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేసే అధికారం కూడా ఐసీసీకి ఉంది.
శ్రీలంక బోర్డు విజ్ఞప్తి
ఈ టోర్నీకి సహ ఆతిథ్యం ఇస్తున్న శ్రీలంక బోర్డు కూడా పాకిస్థాన్‌ను బతిమాలుతోంది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే టికెట్ల అమ్మకాలు, పర్యాటకం ద్వారా వచ్చే భారీ ఆదాయాన్ని కోల్పోతామని, ఇది తమ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని లంక ఆందోళన వ్యక్తం చేస్తోంది.
నేడే క్లారిటీ వచ్చే అవకాశం!
ఐసీసీ అధికారులతో జరిగిన చర్చల సారాంశాన్ని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నేడు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు వివరించనున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాక్ జట్టు భారత్‌తో తలపడటం ఖాయం. అయితే ఐసీసీ ఈ అహేతుక డిమాండ్లకు ఎంతవరకు తలొగ్గుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.