For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఫ్యాన్స్‌కు షాక్.. బంగ్లాదేశ్ ప్రపంచకప్ బహిష్కరణ దిశగా?

T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో పెను సంచలనం రేగుతోంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ససేమిరా అంటుండటంతో ఆ జట్టు టోర్నీలో ఉంటుందా లేదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నేడు(జనవరి 21) తన తుది నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానునన టీ20 ప్రపంచ కప్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ పట్టుబట్టడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది.

వివాదానికి అసలు కారణమేంటి?
ఈ గొడవకు బీజం ఐపీఎల్ 2026 వేలంలో పడింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలని బీసీసీఐ ఆదేశించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిచర్యగా బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలను నిషేధించింది. ఆ తర్వాత వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.

T20 World Cup 2026 Bangladesh Facing Possible Ban After India Match Controversy

కెప్టెన్ లిట్టన్ దాస్ షాకింగ్ కామెంట్స్
బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్ లిట్టన్ దాస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు జట్టులోని అయోమయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. "మేం వరల్డ్ కప్ ఆడతామనే నమ్మకం మీకు ఉందా? నాకు కూడా తెలియదు. అసలు మేము ఏ దేశంతో ఆడతామో, ఎక్కడ ఆడతామో ఎవరికీ క్లారిటీ లేదు. దేశమంతా ఇప్పుడు అనిశ్చితిలో ఉంది." అని అన్నాడు. దీనిని బట్టి చూస్తే బంగ్లాదేశ్ జట్టు అయోమయంలో ఉందని తెలుస్తోంది.

ఐసీసీ కఠిన నిర్ణయం?
అయితే ఇటీవల జనవరి 21 (ఈరోజు) లోపు తమ నిర్ణయాన్ని తెలపాలని ఐసీసీ బంగ్లాదేశ్‌కు గడువు విధించింది. మరోవైపు షెడ్యూల్ మార్చే ప్రసక్తే లేదని, భారత్‌లో భద్రతా ముప్పు లేదని ఐసీసీ స్పష్టం చేసింది. ఒకవేళ బంగ్లాదేశ్ తప్పుకుంటే, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నీలోకి తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్-సీలో ఉన్న బంగ్లాదేశ్ తన తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌తో కోల్‌కతాలో ఆడాల్సి ఉంది. ఒకవేళ బంగ్లాదేశ్ తన మొండిపట్టు వీడకపోతే ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భారీ జరిమానాతో పాటు టోర్నీ నుండి బహిష్కరణ తప్పకపోవచ్చు. నేడు వెలువడే ఐసీసీ నిర్ణయం బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించనుంది.

Story first published: Wednesday, January 21, 2026, 10:03 [IST]
Other articles published on Jan 21, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+