Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రత్యర్థులకు వణుకే: రషీద్ ఖాన్ కెప్టెన్సీలో వరల్డ్ కప్ స్క్వాడ్ రెడీ!

T20 World Cup 2026: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 2026 కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు తమ సన్నాహకాలను ముమ్మరం చేసింది. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కెప్టెన్సీలో 15 మంది సభ్యులతో కూడిన జట్టును బోర్డు ఖరారు చేసింది. ఈ జట్టులో సీనియర్ ప్లేయర్లు అయిన గుల్బదిన్ నైబ్, ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ తిరిగి రావడం జట్టుకు పెద్ద బలాన్ని చేకూర్చింది.

మళ్లీ గర్జించనున్న అఫ్గాన్ పులులు
2024 టీ20 ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శనతో సెమీఫైనల్‌కు చేరుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా వంటి దిగ్గజ జట్లను ఓడించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అదే ఊపును 2026 టీ20 ప్రపంచ కప్‌లోనూ కొనసాగించి.. ఈ సారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా రషీద్ సేన బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉండగా.. భుజం గాయం కారణంగా జట్టుకు కొంతకాలం దూరమైన ఫాస్ట్ బౌలర్ నవీన్ ఉల్ హక్ తిరిగి జట్టులోకి రావడంతో పేస్ విభాగం బలోపేతమైంది. మరోవైపు మిడిలార్డర్‌లో స్థిరత్వాన్ని ఇచ్చేందుకు సీనియర్ ఆల్‌రౌండర్ గుల్బదిన్‌ను ఎంపిక చేశారు. ముజీబ్ ఉర్ రెహ్మాన్ రాకతో స్పిన్ విభాగం మరింత పదునుదేరింది. అయితే యువ స్పిన్నర్ ఘజన్‌ఫర్‌ను రిజర్వ్ ఆటగాడిగా ఎంపిక చేశారు. వికెట్ కీపర్ మహమ్మద్ ఇషాక్, యువ పేసర్ అబ్దుల్లా అహ్మద్‌జాయ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

T20 World Cup 2026 Afghanistan Announce Squad Under Rashid Khan Captaincy

అఫ్గానిస్థాన్ జట్టు ఇదే:
రషీద్ ఖాన్ (కెప్టెన్), రహమానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ, గుల్బదిన్ నైబ్, నజీబుల్లా జద్రాన్, కరీం జనత్, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, నూర్ అహ్మద్, మహమ్మద్ ఇషాక్, షాహిదుల్లా కమల్, అబ్దుల్లా అహ్మద్‌జాయ్.

రిజర్వ్ ఆటగాళ్లు: ఎ.ఎమ్.ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.

షెడ్యూల్, గ్రూప్ వివరాలు
అఫ్గానిస్థాన్ గ్రూప్-Dలో ఉంది. ఈ గ్రూప్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, యూఏఈ, కెనడా జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 8న చెన్నై వేదికగా న్యూజిలాండ్‌తో మొదటి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రపంచ కప్‌నకు ముందు జనవరి 19 నుంచి 22 వరకు యూఏఈలో వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది.

Story first published: Thursday, January 1, 2026, 11:00 [IST]
Other articles published on Jan 1, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+