For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: ఓపెనర్‌గా రోహిత్ వద్దు.. మాజీ క్రికెటర్ కొత్త ప్రతిపాదన

మరో నాలుగు రోజుల్లో మహా సమరం ప్రారంభం కానుంది. జూన్ 2న నుంచి మొదలయ్యే టీ20 వరల్డ్ కప్‌కు అమెరికా-వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న భారత్ పొట్టి ప్రపంచకప్‌లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సారి కప్‌ను ముద్దాడాలని పక్కా ప్రణాళికలతో యూఎస్‌ఏలో అడుగుపెట్టింది.

అగ్రరాజ్యలో కఠోర సాధన చేస్తూ టీమిండియా చెమటోడుస్తుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడుతూ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మెగాటోర్నీలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా బరిలోకి దిగొద్దని మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ సూచించాడు. రోహిత్‌కు బదులుగా యశస్వీ జైస్వాల్‌తో కలిసి విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ప్రారంభించాలని పేర్కొన్నాడు. పరిస్థితులకు తగ్గట్లుగా రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాలని అన్నాడు.

T20 World Cup 2024 Virat Kohli and Jaiswal should open for India Wasim Jaffer

జట్టు ఆరంభానికి తగ్గట్లుగా సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్ స్పిన్‌లో ఎంతో బాగా ఆడగలడని, కాబట్టి నాలుగో స్థానంలో వస్తే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని వసీమ్ జాఫర్ అభిప్రాయపడ్డాడు. ట్విటర్ వేదికగా తన సలహాలు వివరించాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లి ఓపెనర్‌గా సత్తాచాటాడు. 15 మ్యాచ్‌ల్లో 61 సగటు, 154 స్ట్రైక్‌రేటుతో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు.

అయితే ఓపెనర్‌గా కోహ్లి ఓకే అని, కానీ రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం సరైన ఆలోచన కాదని జాఫర్ ట్వీట్‌కు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా రోహిత్ ఓపెనర్‌గా రావడమే కరెక్ట్ అని తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. కాగా, గ్రూప్-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, ఆతిథ్య జట్టు అమెరికా ఉన్నాయి. న్యూయార్క్ వేదికగా జూన్ 5న ఐర్లాండ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది.

టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్య‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్ పంత్‌ (వికెట్‌ కీపర్‌) సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్‌ గిల్‌, రింకూ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అవేష్‌ ఖాన్.

Story first published: Wednesday, May 29, 2024, 16:23 [IST]
Other articles published on May 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+