Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: పొట్టి ప్రపంచకప్‌కు దూసుకొచ్చిన ఉగాండా.. జింబాబ్వేకు షాక్!

వచ్చే ఏడాది జరిగే పొట్టి ప్రపంచ కప్‌లో తలపడే చివరి జట్టు ఏదో తేలిపోయింది. ఆఫ్రికాకు చెందిన ఉగాండా ఈ స్థానాన్ని సొంతం చేసుకుంది. తాజాగా ర్వాండాతో జరిగిన మ్యాచులో ఉగాండా చాలా ఈజీగా విజయం సాధించింది. దీంతో వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్ ఆడే జట్ల జాబితాలో చివరిదైన 20వ స్థానాన్ని ఉగాండా సొంతం చేసుకుంది.

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ర్వాండా.. 18.5 ఓవర్లలో కేవలం 65 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఉగాండా 8.1 ఓవర్లలోనే ఛేదించి ఘనవిజయం నమోదు చేసుకుంది. వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో మొత్తం 20 జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆఫ్రికాకు చెందిన నమీబియా కూడా ఈ వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

T20 World Cup 2024 Uganda qualifies as Zimbabwe knocked out of qualifiers

టాంజానియాను ఓడించిన నమీబియా.. వరల్డ్ కప్‌లో తమ బెర్తును ఖరారు చేసుకుంది. ఇప్పుడు మరో ఆఫ్రికా దేశం ఉగాండా కూడా వరల్డ్ కప్ బెర్తు ఖాయం చేసుకుంది. అయితే ఎన్నో అంచనాలతో ఈ క్వాలిఫైయర్స్ ఆడిన జింబాబ్వేకు మాత్రం పరాభవం తప్పలేదు. ఈ క్వాలిఫైయర్స్‌లో నమీబియా, ఉగాండా చేతిలో జింబాబ్వే ఓటమిపాలైంది.

ఈ రెండు ఓటములు జింబాబ్వే అవకాశాలను బాగా దెబ్బతీశాయి. ఇక తమ చివరి మ్యాచులో కెన్యాను జింబాబ్వే చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 217 పరుగులు చేసింది. కెన్యా ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 107 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ భారీ విజయం సాధించినా కూడా జింబాబ్వే.. వరల్డ్ కప్‌కు అర్హత సాధించలేదు. ఉగాండా ఈ స్థానాన్ని భర్తీ చేసింది.

2024 టీ20 వరల్డ్ కప్ ఆడే 20 జట్టు: వెస్టిండీస్, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఇండియా, నెదర్లాండ్స్, న్యూజిల్యాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, కెనడా, నేపాల్, ఒమన్, నమీబియా, ఉగాండా

Story first published: Thursday, November 30, 2023, 16:54 [IST]
Other articles published on Nov 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+