For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup 2024: సూపర్-8కు అర్హత సాధించే పసికూనలు ఇవే!

టీ20 వరల్డ్ కప్‌-2024లో రోజురోజుకో సంచలనాలు నమోదవుతున్నాయి. వ్యాఖ్యాతలు, విశ్లేషకుల అంచనాలు తలకిందులవుతున్నాయి. బలమైన జట్లు ఘోర పరాజయాలను చవిచూస్తున్నాయి. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమ్స్ సంచలన విజయాలు సాధిస్తున్నాయి. స్వల్ప స్కోరులు నమోదవుతున్నప్పటికీ, బంతి బ్యాటు మధ్య భీకరంగా సాగుతున్న పోరులతో ఈ ప్రపంచకప్ అత్యంత ఆసక్తికరంగా మారింది.

దీంతో మెగాటోర్నీ ప్రారంభానికి ముందు ఉన్న అంచనాలు క్రమంగా మారిపోతున్నాయి. సూపర్-8కు అర్హత సాధించే టీమ్స్ కొత్త ప్రిడిక్షన్స్ మొదలయ్యాయి. మెగా టోర్నీ సూపర్-8 క్వాలిఫై కోసం ఇరవై దేశాలు మొత్తంగా 40 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇప్పటికీ 15 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. దీంతో ఇప్పుడే తదుపరి దశకు అర్హత సాధించే జట్లు ఏవని తేల్చడం అసాధ్యమే. కానీ కొన్ని పసికూన జట్లు సూపర్-8 రేసులో ముందంజలో ఉన్నాయి. బెర్త్‌ను దాదాపు ఖరారు చేసుకున్నాయి.

T20 World Cup 2024 These Underdog Teams Likely to Qualify for Super-8

అగ్రరాజ్యం అమెరికా‌కు అవకాశం
గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధిస్తాయని భావించారంతా. కానీ యూఎస్‌ఏ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలవ్వడంతో సమీకరణాలు మారిపోయాయి. అమెరికా ఆడిన రెండింట్లో గెలిచి నాలుగు పాయింట్లతో టేబుల్‌ టాప్‌లో ఉంది. భారత్, ఐర్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధిస్తే తదుపరి దశకు వెళ్లడానికి యూఎస్‌ఏకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే సూపర్ ఓవర్‌లో పాక్‌పై గెలవడంతో అమెరికాకు నెట్‌రన్‌రేటు పెరగలేదు. సూపర్-8 క్వాలిఫికేషన్‌పై నెట్‌రన్‌రేటు ప్రభావం చూపే అవకాశాలూ ఉంటాయి.

T20 World Cup 2024 These Underdog Teams Likely to Qualify for Super-8

గ్రూప్-బీ‌లో వరుణుడి ఎఫెక్ట్
ఇంగ్లండ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో స్కాట్లాండ్ మూడు పాయింట్లతో టేబుల్ టాప్‌లో ఉంది. దీంతో సూపర్-8 రేసులో స్కాట్లాండ్ ముందంజలోనే ఉంది. అయితే ఆ దశకు అర్హత సాధించాలంటే స్కాట్లాండ్‌కు అదృష్టం కూడా కలిసిరావాలి. ఒమన్, ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌ల్లో ఓ పోరు తప్పక గెలవాలి. మరోవైపు ఆస్ట్రేలియా చేతిలో ఇంగ్లండ్ ఓడిపోవాలి. అంతేగాక అంతిమంగా ఇంగ్లండ్ కంటే ఎక్కువ నెట్‌రన్‌రేటు ఉంటే స్కాట్లాండ్ సూపర్-8కు చేరుతుంది.

T20 World Cup 2024 These Underdog Teams Likely to Qualify for Super-8

అఫ్గానిస్థాన్ బెర్త్ కన్ఫార్మ్
గ్రూప్-సీ నుంచి అఫ్గానిస్థాన్ సూపర్-8కు అర్హత సాధించడం దాదాపు ఖాయమే. న్యూజిలాండ్, ఉగాండ మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలిచిన అఫ్గాన్ +5.225 నెట్‌రన్‌రేటుతో టాప్‌లో ఉంది. పవువా న్యూ గినియా, వెస్టిండీస్‌లతో తర్వాత జరగనున్న మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా అఫ్గానిస్థాన్ సునాయాసంగా సూపర్-8కు చేరుతుంది. ఇక గ్రూప్-డీ నుంచి సూపర్-8 రేసులో పసికూన జట్లు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ కూడా ఉన్నాయి. అయితే గ్రూప్-డీ‌లో మరికొన్ని మ్యాచ్‌లు సాగే వరకు ఏ జట్టుపై ఓ అంచనాకు రాలేం.

Story first published: Saturday, June 8, 2024, 14:11 [IST]
Other articles published on Jun 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+