Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: ఇది దారుణం! భారత్‌‌కో న్యాయం..మాకో న్యాయమా?- తీక్షణ

టీ20 వరల్డ్ కప్-2024‌ గ్రూప్ స్టేజ్‌లో తమ జట్టు ఆడే నాలుగు మ్యాచ్‌లు భిన్నమైన నాలుగు వేదికల్లో ఆడేట్లుగా షెడ్యూల్‌ను సిద్ధం చేశారని శ్రీలంక స్పిన్నర్ తీక్షణ అన్నాడు. కొన్ని జట్లకు మాత్రం అన్ని మ్యాచ్‌లు ఒకే వేదికగా నిర్వహిస్తున్నారని భారత్‌ గురించి తీక్షణ పరోక్షంగా ప్రస్తావించాడు. ఇది చాలా అన్యాయమని అన్నాడు.

అంతేగాక తమ జట్టు బస చేయడానికి ఇచ్చిన హోటల్ నుంచి మైదానానికి రావడానికి సుమారు గంట 40 నిమిషాల సమయం పడుతుందని నిర్వాహకులపై మండిపడ్డాడు. కొన్ని జట్లకు మాత్రం 15 నిమిషాల్లోనే స్టేడియానికి వచ్చేలా ఏర్పాట్లు చేశారని, ఇది తీవ్ర అన్యాయమని ఆరోపించాడు. ఇక దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కోసం న్యూయార్క్‌కు వచ్చే క్రమంలో విమానశ్రయంలోనే తమ ఆటగాళ్లంతా ఎనిమిది గంటలు వేచి చూసిన పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నాడు.

T20 World Cup 2024 Theekshana Criticizes Sri Lanka s Gruelling World Cup Schedule

ఈ ప్రపంచకప్‌లో మునపెన్నడూ లేని విధంగా ఇరవై దేశాలు బరిలోకి దిగాయి. ఈ మెగాటోర్నీ కోసం అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యం ఇస్తుంది. కాగా, ఇరవై దేశాలను అయిదు దేశాల చొప్పున నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ స్టేజ్‌లో ఒక జట్టు తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే టోర్నీలో శ్రీలంక, నెదర్లాండ్స్ మాత్రమే నాలుగు మ్యాచ్‌లను భిన్నమైన వేదికలపై ఆడేలా ఐసీసీ షెడ్యూల్‌ను రూపొందించింది.

మరోవైపు గ్రూప్ స్టేజ్‌లో భారత్, దక్షిణాఫ్రికా ఒకే వేదికగా మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఒక మ్యాచ్ మాత్రమే మరో వేదికగా తలపడనుంది. అయితే దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ముగిసిన అనంతరం శ్రీలంక బౌలర్ తీక్షణ తమ షెడ్యూల్‌ గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. గ్రూప్-డీలో సౌతాఫ్రికా, లంకతో పాటు బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి.

అయితే తాను షెడ్యూల్‌ గురించి ప్రస్తావించడానికి గల కారణాలను తీక్షణ వివరించాడు. ఈ ఏడాది మ్యాచ్‌ వేదికలను మార్చలేరని, కానీ భవిష్యత్‌లో అయినా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా చర్చలు తీసుకోవాలని తెలిపాడు. కాగా, న్యూయార్క్‌లో నాసా కంట్రీ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో శ్రీలంక ఆరు వికెట్ల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది.

Story first published: Tuesday, June 4, 2024, 16:21 [IST]
Other articles published on Jun 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+