Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌ను మించిన క్రికెట్ ఫీవర్: మే 1 కోసం వెయిటింగ్..!!

T20 World Cup 2024 India squad: ఐపీఎల్ 2024లో రసవత్తరంగా కొనసాగుతోంది. సగానికి పైగా టోర్నమెంట్ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అయింది. ఎనిమిది విజయాలు- 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందా జట్టు.

పదేసి చొప్పున పాయింట్లను సాధించిన కోల్‌కత నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్.. ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క విజయం సాధించితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా వీటి సరసన చేరుతుంది. నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించాల్సిన ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది.

T20 World Cup 2024 The formal announcement for India squad likely on May 1

ఈ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌కు రెడీ అవుతుంది టీమిండియా. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌.. ఇందులో ఉన్నాయి.

ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మెగా ఈవెంట్‌లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.

టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును మే 1వ తేదీన ప్రకటించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. దీనిపై ఇప్పటికే ఓ ఫార్మల్ మీటింగ్ సైతం ముగిసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కేప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే దేశ రాజధానిలో సమావేశం అయ్యారు కూడా. వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టుపై ఓ నిర్ణయానికి వచ్చారు. మే 1వ తేదీన అధికారికంగా జట్టును ప్రకటించనున్నారు.

మే 1వ తేదీ నాటికి అన్ని దేశాలు కూడా తమ జట్టు వివరాలను అందించాల్సి ఉంటుందంటూ ఐసీసీ ఇప్పటికే డెడ్ లైన్ పెట్టింది. దీనితో ఆ రోజు సాయంత్రం నాటికి లిస్ట్ ప్రకటించనుంది బీసీసీఐ.

Story first published: Sunday, April 28, 2024, 10:47 [IST]
Other articles published on Apr 28, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+