T20 World Cup 2024: ఆటగాళ్లకు ఐపీఎల్ దెబ్బ?.. చివరి వరకు ఆడటం కష్టమేగా?
వన్డే వరల్డ్ కప్ ఓటమి గురించి ఇంకా మర్చిపోకముందే.. ఇప్పుడు భారత జట్టు పొట్టి ప్రపంచ కప్ కోసం రెడీ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. వచ్చే ఏడాది ఈ వరల్డ్ కప్ అయినా భారత్ గెలుస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఈసారి యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా ఈ వరల్డ్ కప్ జరగనుంది.
అయితే కచ్చితంగా వరల్డ్ కప్ ఎప్పుడు మొదలవుతుందో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. తాజాగా దీనిపై కూడా క్లారిటీ వచ్చేసింది. వచ్చే ఏడాది జూన్ 3 నుంచి ఈ పొట్టి ప్రపంచ కప్ జరగనుందట. మొత్తం 28 రోజుల తర్వాత అంటే జూన్ 30 వరల్డ్ కప్ ఫైనల్ జరుగుతుందని తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఐపీఎల్ జరిగిన వెంటనే ఈ వరల్డ్ కప్ జరగనుందన్నమాట. ఎందుకంటే ఈ దాదాపుగా వేసవి కాలంలోనే ఐపీఎల్ జరుగుతుంది. ఏప్రిల్‌లో మొదలయ్యే ఐపీఎల్.. మే నెలలో ముగుస్తుంది. ఈ లీగ్ ముగియగానే వెంటనే ఆటగాళ్లంతా పొట్టి ప్రపంచకప్ కోసం రెడీ అవ్వాల్సి వస్తుంది.
మరి ఈ ఐపీఎల్ అలసట నుంచి తేరుకోవడం కోసం కీలకమైన ఆటగాళ్లు అందరూ కొంత ముందుగానే లీగ్‌ను వదిలి రెస్ట్ తీసుకుంటారేమో చూడాలి. ఇక ఈ ప్రపంచకప్‌లో కూడా భారత జట్టు ఫేవరెట్‌గానే బరిలోకి దిగనుంది. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు.. ఈ వరల్డ్ కప్‌ను అయినా ఎలాగైనా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా వంటి కీలకమైన ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. ఒకవేళ రోహిత్, కోహ్లీ ఆడితే వాళ్లు కూడా జట్టుకు ప్లస్ అయ్యే ఫామ్‌లోనే ఉన్నారు. ఇక బౌలింగ్‌లో బుమ్రా, షమీలకు అవకాశం దక్కొచ్చు. అలాగే అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ కూడా ఈ వరల్డ్ కప్ ఆడే జట్టులో చోటు సంపాదించొచ్చని తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications