For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20WC: భారత స్టార్ బ్యాటర్‌కు గాయం.. సూపర్-8 మ్యాచ్‌లకు దూరం!

టీ20 వరల్డ్ కప్-2024లో లీగ్ స్టేజ్ ముగిసింది. రేపటి నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. అయితే ఈ కీలక సమయంలో టీమిండియా బిగ్ షాక్ తగిలింది. ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు గాయమైంది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా సూర్య చేతికి బంతి బలంగా తాకింది. వెంటనే ప్రాక్టీస్‌ నుంచి సూర్య వైదొలిగాడు.

సూర్య గాయం తీవ్రత గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగనుండటంతో సూర్య విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సూర్యకు మోస్తారు గాయమైనా తొలి సూపర్-8 పోరుకు విశ్రాంతి ఇవ్వాలని చూస్తోంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పే సూర్య కీలక సూపర్ మ్యాచ్‌లకు దూరమవ్వడం భారత్‌కు ప్రతికూలాంశమే.

T20 World Cup 2024 Suryakumar Yadav Suffers Injury Scare Before Super 8s

ఐర్లాండ్, పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సూర్య విఫలమైనప్పటికీ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అజేయ అర్ధశతకంతో తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఐర్లాండ్ పోరులో కేవలం రెండు పరుగులకే, పాకిస్థాన్ జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగులకే ఔటయ్యాడు. కానీ అమెరికా పోరులో తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. వెస్టిండీస్‌లోని పిచ్‌లు కూడా స్లోగానే ఉంటాయి.

గాయం కారణంగా సూర్య సూపర్-8 మ్యాచ్‌లకు దూరమైతే యశస్వీ జైస్వాల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రోహిత్ శర్మతో పాటు జైస్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్‌లు ఉంటాయి. లీగ్ స్టేజ్‌లో రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి ఓపెనర్‌గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే కోహ్లి మూడు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచాడు. ఐర్లాండ్‌పై ఒక్క పరుగు, పాకిస్థాన్‌పై నాలుగు పరుగులు, అమెరికా మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ఈ నేపథ్యంలో కోహ్లి నెట్స్‌లో తీవ్రంగా సాధన చేస్తున్నాడు. సోమవారం సూర్యతో కలిసి చెమటోడ్చాడు.

కాగా, సూపర్-8 స్టేజ్‌లో గ్రూప్-1లో ఉన్న భారత్.. అఫ్గానిస్థాన్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గురువారం బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత శనివారం ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్‌తో, సెయింట్ లూసియా వేదికగా సోమవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Story first published: Tuesday, June 18, 2024, 11:22 [IST]
Other articles published on Jun 18, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+