Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20WC: సూపర్-8లో దక్షిణాఫ్రికా.. బంగ్లాను చిత్తు చేసి టేబుల్ టాపర్‌గా!

గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా విజయాలతో హోరెత్తిస్తోంది. బంగ్లాదేశ్‌పై ఆఖరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో నాలుగు పరుగుల తేడాతో నెగ్గి హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. ఈ గెలుపుతో సూపర్-8లో బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది. మూడు మ్యాచ్‌లు ఆడిన సఫారీ సేన ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. మిగిలిన మ్యాచ్‌లో పసికూన నేపాల్‌తో తలపడనుంది. ఈ పోరులో గెలిస్తే టేబుల్ టాపర్‌గా లీగ్ స్టేజ్‌ను ముగిస్తుంది.

అయితే స్వల్ప స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికాకు విజయం అంత సులువుగా దక్కలేదు. బౌలర్ల టాప్ క్లాస్ ప్రదర్శనతో అంతిమంగా ఊపిరిపీల్చుకుంది. నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (46; 44 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (29; 38 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. తంజీమ్ హసన్ షకీబ్ (3/18) మూడు, తస్కిన్ అహ్మద్ (2/19) రెండు వికెట్లతో సత్తాచాటారు.

T20 World Cup 2024 South Africa Triumphs Over Bangladesh in Thrilling Match

23 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును క్లాసెన్-మిల్లర్ ఆదుకున్నారు. కఠిన పిచ్‌పై ఈ జోడీ జాగ్రత్తగా ఆడుతూ పరుగులు సాధించారు. అయిదో వికెట్‌కు 75 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే గేర్ మార్చి దూకుడుగా పరుగులు చేయాలనుకున్న తరుణంలో బంగ్లాదేశ్ బౌలర్లు సత్తాచాటి ఇద్దరినీ పెవిలియన్‌కు చేర్చి స్కోరును కట్టడి చేశారు.

అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. ఆదిలోనే బంగ్లా వరుసగా కీలక వికెట్లు కోల్పోయింది. 50 పరుగులకే నలుగురు బ్యాటర్లు పెవిలియన్‌కు చేర్చారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన తౌహిద్ హృదోయ్ (37; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మహ్మదుల్లా (20; 27 బంతుల్లో, 2 ఫోర్లు) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.

అయితే బంగ్లా విజయానికి చివరి 18 బంతుల్లో 20 పరుగులు అవసరమవ్వగా తౌహిద్‌ను రబాడ ఔట్ చేసి తిరిగి సౌతాఫ్రికాను పోటీలోకి తెచ్చాడు. 18వ ఓవర్‌లో రబాడ వికెట్ తీసి కేవలం రెండు పరుగులే ఇవ్వడంతో మ్యాచ్ బంగ్లా చేతుల్లో నుంచి చేజారింది. ఆ తర్వాత విజయ సమీకరణం ఆఖరి ఓవర్‌లో 11 పరుగులగా మారగా మహరాజ్ రెండు వికెట్లు తీసి ఆరు పరుగులే ఇచ్చాడు. కేశవ్ మహరాజ్ (3/27) మూడు, నోకియా (2/17), రబాడ (2/19) రెండు వికెట్లతో రాణించారు.

Story first published: Tuesday, June 11, 2024, 7:45 [IST]
Other articles published on Jun 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+