For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఊరందరిదీ ఒక దారైతే.. పాకిస్తాన్‌ది మరో దారి

Pakistan squad for T20 World Cup 2024: ఐపీఎల్ 2024 ముగిబోతోంది. ఈ నెల 27వ తేదీన ఫైనల్. దీని తరువాత టీ20 వరల్డ్ కప్‌ 2024 టోర్నమెంట్‌‌ మొదలు కానుంది. సుమారు నెల రోజుల పాటు ఉర్రూతలూగించనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.

జూన్ 2వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. 29వ తేదీ వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికా.. సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోన్నాయి. ఈ రెండు దేశాలు కలిపి మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి.

T20 World Cup 2024 Ramiz Raja made key remarks on Pakistan has not announced its squad

తొలి సగం మ్యాచ్‌లు వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా అండ్ బార్బుడా, బార్బడోస్, గయానా, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, గ్రెనడైన్స్, ట్రినిడాడ్ అండ్ టొబాగోల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మిగిలిన సగం మ్యాచ్‌లు- అమెరికాలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌ స్టేడియాల్లో నిర్వహించనుంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ట్రినిడాడ్, గయానాల్లో రెండు సెమీ ఫైనల్స్, బార్బడోస్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. భారత్ సహా అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌లో ఆడబోయే జట్లను ఇప్పటికే ప్రకటించాయి కూడా. ఐపీఎల్ 2024 సీజన్‌లో ప్లేఆఫ్స్, ఫైనల్స్ ఆడబోయే ఫ్రాంఛైజీల ప్లేయర్లు మినహా టీమిండియాకు ఎంపికైన మిగిలిన క్రికెటర్లు ఈ నెల 24వ తేదీన వెస్టిండీస్‌కు బయలుదేరే అవకాశం ఉంది.

అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా తమ జట్లను ప్రకటించాయి.. ఒక్క పాకిస్తాన్ తప్ప. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును ఇప్పటివరకూ వెల్లడించలేదు. ఇంకా చెప్పాలంటే అసలు టీమ్ సెలెక్షన ప్రాసెస్‌నే మొదలు పెట్టలేదు. వరల్డ్ కప్ కోసం జట్టును ఇంకా అనౌన్స్ చేయని దేశం ఏదైనా ఉందంటే అది పాక్ ఒక్కటే.

దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాజీ ఛైర్మన్ రమీజ్ రజా స్పందించారు. ఎందుకు జట్టును ప్రకటించడంలో పీసీబీ ఇబ్బందులు పడుతున్నదో అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్ కాంబినేషన్‌ను చక్కగా హ్యాండిల్ చేయగల బ్యాటర్లు జట్టులో ఉన్నారని, అయినప్పటికీ సెలెక్షన్‌లో ఆచితూచి నిర్ణయం తీసుకుంటోందని అన్నారు.

ప్రతి ప్లేయర్ కూడా ట్రయల్స్‌లో ఉన్నట్లే కనిపిస్తోందని చెప్పారు రమీజ్ రజా. బౌలర్లు ఒత్తిడికి గురవుతున్నారని, వరల్డ్ కప్‌లో దాన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐర్లాండ్‌పై మూడు మ్యాచ్‌ల సిరీస్ సందర్భంగా హసన్ అలీ అవుట్ అయిన విధానం, ఫ్లాట్ పిచ్‌లపై మహ్మద్ అమీర్ ఆటతీరు తనను నిరాశ పరిచిందని చెప్పారు.

జట్టులో అబ్బాస్ అఫ్రిది రోల్ ఏమిటో తెలియట్లేదని రమీజ్ రజా అన్నారు. వరల్డ్ కప్ ఆడబోయే టీమ్‌ను ఎంత త్వరగా ప్రకటించ గలిగితే అంత మంచిదని చెప్పుకొచ్చారు. ఐర్లాండ్ సిరీస్‌లో బాబర్ ఆజమ్ స్ట్రైక్ రేట్ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. ఐర్లాండ్ బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉన్నప్పటికీ.. ఆజమ్ ఆడిన తీరు ఎలాంటి బౌలర్నయినా చుక్కలు చూపించేలా ఉందని పేర్కొన్నాడు.

Story first published: Wednesday, May 15, 2024, 13:12 [IST]
Other articles published on May 15, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+